తమ్ముడు అఖిల్ నటించిన 'ఏజెంట్' రిజల్ట్ పై హీరో నాగచైతన్య స్పందించాడు. యాక్టర్స్ కెరీర్ లో ఇవన్నీ చాలా సహజమని అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.
అక్కినేని హీరోలకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు! గత ఏడాది కాలాన్ని తీసుకుంటే.. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అందరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలయ్యాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. మొన్నీమధ్య ‘ఏజెంట్’ రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి నాగచైతన్య ‘కస్టడీ’పై పడింది. సరిగా ఈ టైంలో తమ్ముడు అఖిల్ మూవీ ఫలితంపై చైతూ కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది దసరాకి ‘ద ఘోస్ట్’గా వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాగచైతన్య ‘థాంక్యూ’ అని పలకరించాడు. తాజాగా ‘ఏజెంట్’గా అఖిల్ వచ్చాడు. ఈ మూడు సందర్భాల్లోనూ ఫ్యాన్స్ ఓ మాదిరి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రాలన్నీ కూడా ఫెయిలయ్యాయి. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ‘కస్టడీ’ కోసం అందరూ చూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చైతూకి.. అక్కినేని హీరోల సినిమాలు ఫెయిలవుతుండటంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఇతడు చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
‘ఫ్యాన్స్ కి మేం మంచి సక్సెస్ ని ఇవ్వాలని అనుకుంటాం. వారి అభిమానం, ప్రేమకు మేం తిరిగిచ్చేది ఒక మంచి సినిమానే. ఇటీవల మా కుటుంబం నుంచి కొన్ని చిత్రాలతు సరైన రిజల్ట్ రాలేదు. యాక్టర్స్ కెరీర్ లో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా సహజం. ఈ టైం కొన్నాళ్లకు వెళ్లిపోతుంది. తప్పకుండా మేం ఆడియెన్స్ ని మళ్లీ ఎంటర్ టైన్ చేస్తాం. మా ఫ్యాన్స్ ఆశించే రిజల్ట్ ‘కస్టడీ’ నుంచి రాబోతుందని నేను నమ్ముతున్నాను’ అని నాగచైతన్య చెప్పాడు. ఇక్కడ ‘ఏజెంట్’ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు తప్పితే డైరెక్ట్ గా మాత్రం చెప్పలేదు. మరి ‘ఏజెంట్’ ఫ్లాప్ పై చైతూ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.