స్టార్ హీరోలు లేదా హీరోయిన్స్ చూడగానే వాళ్లకేంటి.. లైఫ్ ఫుల్ హ్యాపీగా గడుపుతున్నారులే అనుకుంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి మనుషులే. ఆనందం, బాధ అన్నీ కూడా మనలాగే ఉంటాయి. కాకపోతే మనకు అవి పెద్దగా తెలియనివ్వరు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది కూడా ఏదైనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు జరిగిన సంఘటనల్ని రివీల్ చేస్తుంటారు. ఇక ‘మేజర్’, ‘హిట్ 2’ లాంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన హీరో అడివి శేష్ కూడా ఓసారి ఎమోషన్ ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాడట. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తనకు తాను హీరోగా ఎదిగిన వ్యక్తి అడివి శేష్. ‘సొంతం’ సినిమాలో కొన్ని సెకన్ల పాటు కనిపించిన శేష్.. పవన్ ‘పంజా’లో విలన్ తరహా గెటప్ లో కనిపించి చాలా మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయపాత్రలు చేస్తూనే.. హీరోగానూ ‘కర్మ’, ‘కిస్’ లాంటి మూవీస్ చేశాడు. కానీ అవి బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఇక ఛాన్సులు కోసం వెతుక్కోవడం కంటే తానే సొంతంగా స్టోరీస్ రాసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అలా క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమాలు చేశాడు.
ఇక ఈ ఏడాది ‘మేజర్’ లాంటి మూవీతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించాడు. తాజాగా ‘హిట్ 2’తో వచ్చిన శేష్.. మళ్లీ హిట్ కొట్టాడు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇతడు.. ‘మేజర్’ షూటింగ్ టైంలో ఓ సంఘటన గురించి బయటపెట్టాడు. ‘మా షూటింగ్ జరుగుతున్న స్టూడియోని బాలీవుడ్ లో ఓ మూవీ యూనిట్ బుక్ చేసుకుంది. మేజర్ సినిమాలో అగ్నిప్రమాదానికి సీన్స్ తీస్తుంటే నేను అస్వస్థతకు గురయ్యాను. అందువల్ల షూట్ లేటైంది. దీంతో స్టూడియో వాళ్లు.. మా సెట్ కూల్చేయడానికి సిద్ధమయ్యారు. కాస్త టైం ఇవ్వమని అడిగినా ఒప్పుకోలేదు. క్లైమాక్స్ లో దాదాపు 8 సీన్స్ తీయాల్సి ఉంది. చేతిలో 30 నిమిషాల టైం మాత్రమే ఉంది. దీంతో ఏం చేయాలో తెలీక ఏడ్చేశాను. ఆ టైంలో డైరెక్టర్ శశికిరణ్ నా దగ్గరకు వచ్చి.. మీరు ఏ ఎమోషన్ అయితే ఫీలవుతున్నారో అదే కెమెరా ముందు చూపించండి అన్నాడు. రెండు కెమెరాలతో అనుకున్న టైంకి షూట్ పూర్తి చేశాం’ అని శేష్ చెప్పుకొచ్చాడు. మరి అడివి శేష్ సినిమాల్లో మీకు ఏదంటే బాగా ఇష్టం.. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.