ఆదిపురుష్‌లోని రావణాసురుడి గెటప్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. కొంతమంది తెలుగు నెటిజన్లు ఈ సీన్‌ను అమృతం సీరియల్ సీన్‌తో లింక్ చేస్తున్నారు.
రామయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు అస్సలు బాగోలేదని కుండ బద్దలు కొడుతున్నారు. ఇక, ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ను నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. ఓం రౌత్ రామయణాన్ని తనకిష్టం వచ్చినట్లు మార్చేసుకున్నాడని, అందులోని పాత్రల్ని దారుణంగా చిత్రీకరించాడని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి నుంచి రాముడు, రావణుడి గెటప్‌లపై ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత ఆ ట్రోల్స్ మరింత పెరిగాయి. సినిమాలో ఓ సన్నివేశంలో రావణుడి తలలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఈ సీన్‌పై కూడా భీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. తెలుగు నెటిజన్లు.. ఈ సీన్‌ను అమృతం సీరియల్లోని సీన్‌కు లింక్ చేస్తున్నారు. అమృతం సీరియల్లోని ఓ ఎపిసోడ్లో అమృతంతో పాటు మిగిలిన వాళ్లు రామయణం నాటకం వేస్తారు. అమృతం రావణుడి పాత్ర కోసం పది తలలను సిద్ధం చేస్తాడు.
అయితే, ఆ తలలను ఒకదానిపై ఒకటి పెడతాడు. ‘ఏంటి తలలు పైకి పెట్టావు’ అని రావణుడి పాత్రధారి అడగ్గా.. ‘మన శాస్త్రం ఏం చెబుతోంది. తలలు నిటారుగా ఉండాలి. వంకరగా ఉండాలి. రెక్టాంగిల్లో ఉండాలి. పిరమిడ్ టైప్‌లో ఉండాలి అని ఏం చెప్పట్లేదు. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోమని చెప్పింది’’ అని అమృతం అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.