ఈమె స్టార్ హీరోయినే కానీ తెలుగులో అస్సలు కలిసిరాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇంతకీ ఎవరీమె కనిపెట్టారా?
ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తెలుగులో. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లకు పైనే అయిపోయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికీ అస్సలు కలిసి రాలేదు. దీంతో టాలీవుడ్ లో దుకాణం సర్దేసింది. బాలీవుడ్ కి చెక్కేసింది. జస్ట్ కొన్నేళ్లలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమె చెల్లెలు ఇప్పుడు టాలీవుడ్ లో తీస్తున్న ఓ బడా మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. మరి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా తెలుగులో చేసే హీరోయిన్లు చాలామంది ముంబయి నుంచి వస్తుంటారు. ఈమె కూడా సేమ్ అలానే మహేష్ బాబు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటరైంది. ఆ మూవీని సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసినప్పటికీ.. ఆడియెన్స్ ఎందుకో సరిగా ఎక్కలేదు. దీంతో ‘వన్: నేనొక్కడినే’ మూవీ ఫెయిలైంది. ఇందులో హీరోయిన్ గా చేసిన కృతిసనన్.. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’ అని మరో చిత్రం చేసింది. అది కూడా ప్లాఫ్ అయింది. పైన ఫొటోలో ఉన్న పాప.. ఈ హీరోయినే. తెలుగులో కలిసి రాకపోవడంతో బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది.
హీరోయిన్ గా తెలుగులో చేసిన రెండు సినిమాలు ఫెయిలయ్యేసరికి సొంత ఇండస్ట్రీ బాలీవుడ్ కి చెక్కేసింది. 2015 నుంచి అక్కడే హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. యంగ్, సీనియర్ అనే తేడా లేకుండా అందరితో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె ప్రభాస్ తో నటించిన పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమెకి ప్రభాస్ తో పెళ్లి జరగనుందని ఆ మధ్య రూమర్స్ తెగ వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. సో అదనమాట విషయం. మరి ఈ హీరోయిన్ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎవరైనా గుర్తుపట్టారా? కింద కామెంట్ చేయండి.