బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడో మారు మూల ఉన్న వారిని కూడా ఆర్టిస్టులను చేసిన షో అది. ఆ షోల నుంచి వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో నటిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఆ షోకు అంత ఆదరణ ఉన్నట్లు కనిపించడం లేదు. దాదాపు ఏడు సంవత్సరాలుగా అప్రతిహితంగా నడిస్తున్న షో ఇప్పుడు ప్రేక్షకులను నవ్వించలేకపోతోంది అనే విమర్శలు వస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే.. ఆర్టిస్టులు సైతం వేరే షోలకు వెళ్లడం చేస్తున్నారు. చమ్మక్ చంద్ర, ముక్కు అవినాశ్ వంటి వాళ్లు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులోకి అదిరే అభి కూడా చేరిపోయాడు. అవును అదిరే అభి జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేశాడు.
అదిరే అభి అంటే ఆర్టిస్టే కాదు.. ఒక మంచి మనిషి కూడా. హైపర్ ఆది లాంటి వారిని ఎందరినో షోలోకి తీసుకొచ్చి వారికి లైఫ్ ఇచ్చాడు. మరి, జబర్దస్త్ షోకు అభి ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో కారణాలు తెలియరాలేదు. కానీ, తన తదుపరి ప్రయాణం మాత్రం కామెడీ స్టార్స్ వైపు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఆదివారం అదిరే అభి కామెడీ స్టార్స్ లోకి ఎట్రీ ఇస్తున్నాడని గట్టిగా వినిపిస్తోంది. అభి ఒక్కడే కాదు ఈ లిస్టులోకి ఇంకా కొన్ని పేర్లు చేరుతాయని తెలుస్తోంది. అదిరే అభి జబర్దస్త్ కు వీడ్కోలు చెప్పడానికి కారణాలు ఏమై ఉంటాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.