తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమీ కాదు. ఒకే సినిమాలో కలిసి నటించిన నటీ, నటులు ప్రేమలో పడటం.. ఆ ప్రేమ పెళ్లికి దారితీయ్యటం లాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అలానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు ఆది పినిశెట్టి. ఒక వైపు సోలో హీరోగా నటిస్తూనే.. విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆది-నిక్కీ గల్రానీ జంటకు సంబంధించిన ఓ వార్త ఇటు తెలుగు పరిశ్రమలో అటు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని అక్కడి పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆది పినిశెట్టి.. ఒక వి చిత్రం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఆది. తనదైన కథల సెలక్షన్ తో చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నాడు ఆది. ఒక పక్క హీరోగా నటిస్తూనే.. మరో పక్క విలన్ పాత్రలతో అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో 2022 మే 18 వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆది-నిక్కీల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ హీరోలైన సందీప్ కిషన్, నాని మరికొందరు హాజరైయ్యారు. అయితే ప్రస్తుతం ఈ దంపతుల గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆది-నిక్కీ ల జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ జోరుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు ఈ జంట. కోలీవుడ్ లో మాత్రం నిక్కీ గర్భవతి అయ్యిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆది అటు హీరోగా.. ఇటు విలన్ గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాలు చేస్తూ ఆది బిజీగా ఉన్నాడు. తాజాగా ఆది పినిశెట్టి హీరో రామ్ నటించిన ‘వారియర్’ చిత్రంలో విలన్ గా నటించి.. విమర్శకుల ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం ఘాటైన హీరోలకు ధీటైన విలన్ గా ఆది పినిశెట్టి ఇండస్ట్రీలో కనిపిస్తున్నాడు. దాంతో ఫ్యాషనేట్ విలన్ లకు ఆది పినిశెట్టి మంచి ఛాయిస్ గా మారాడు. దాంతో దర్శకుల చూపు ఇప్పుడు ఆదిపై పడింది.