వాళ్లిద్దరూ ఒకే మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం సినిమాలతో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ కూడా తమ భాయ్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చిన్న నటీనటుల దగ్గర నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ మ్యారేజ్ అనే బంధంలో అడుగుపెట్టేస్తున్నారు. ఓ ఇంటివారు అయిపోతున్నారు. తాజాగా పలువురు టీమిండియా క్రికెటర్లు కూడా పెళ్లి చేసుకుని అభిమానుల్ని సర్ ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ నటీమణులు జస్ట్ వారం రోజుల వ్యవధిలో పెళ్లి చేసుకున్నారు. అది కూడా గత కొన్నాళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు నడిచేశారు. ఆమె పెళ్లిలో ఈమె సందడి చేస్తే.. ఇప్పుడు ఈమె పెళ్లిలో ఆమె సందడి చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షారుక్ ఖాన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ‘చక్ దే’ మూవీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. భారత మహిళల హాకీ జట్టు, ప్రపంచకప్ గెలవడం అనే స్టోరీతో తీసిన సినిమా.. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటుంది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చిత్రాశి రావత్, తాన్య అబ్రోల్ కూడా ఉన్నారు. తాజాగా వారం క్రితం చిత్రాశి రావత్.. తన బాయ్ ఫ్రెండ్, నటుడు ధ్రువ్ ఆదిత్యని మ్యారేజ్ చేసుకుంది. ఈ వేడుకలో ‘చక్ దే’ యాక్టర్స్ చాలామంది సందడి చేశారు. ఇది జరిగిన సరిగ్గా వారం రోజులకు తాన్య అబ్రోల్ పెళ్లి చేసుకుంది.
ఫిబ్రవరి 9న చంఢీగడ్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తాన్య పెళ్లి చేసుకుంది. ఐటీ ప్రొఫెషనల్ అయిన ఆశిష్ వర్మతో ఏడాదిగా రిలేషన్ లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏడడుగులు వేసింది. ఈ వేడుకకు చిత్రాశితో పాటు ‘చక్ దే’ భామలు చాలామంది విచ్చేశారు. తెగ సందడి చేశారు. ఈ ఫొటోల్ని తమ తమ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా రోజుల వ్యవధిలో ఇద్దరూ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోవడం ఆసక్తిగా అనిపించింది. మరి ఈ పెళ్లి ఫొటోలు చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
#ChakDeIndia star @tanyaAbrol ties the knot with boyfriend #AashishVerma ♥️
Here are some glimpses from the #wedding festivities, featuring the #ChakDe girls 🫶🏻#TanyaAbrol #VidyaMalavade #ChitrashiRawat #BalbirKaur #Wedding #AryaMenon #ShilpaShukla #ShubhiMehta pic.twitter.com/ApyJp1lJnG
— Delhi Times (@DelhiTimesTweet) February 10, 2023