సినిమా ఛాన్సుల కోసమో ఏమో గానీ బాలీవుడ్ గురించి చాలామంది హీరోయిన్లు గొప్పగా చెబుతుంటారు. కాజల్ అగర్వాల్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరువు మొత్తం తీసేసింది. సౌత్ ఇండస్ట్రీ చాలా బెటర్ అని చెప్పింది.
కొన్నాళ్ల ముందు వరకు ఇండియన్ సినిమా అంటే అందరికీ తెలిసింది బాలీవుడ్ మాత్రమే. యంగ్ బ్యూటీస్ నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ప్రతిఒక్కరు కూడా హిందీలో నటించాలి, ఫేమ్ తెచ్చుకోవాలి అని తెగ తాపత్రయపడేవారు. మరికొందరు భామలైతే.. సౌత్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత మన సినిమాలపైనే చాలా చీప్ కామెంట్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో తాప్సీతో పాటు చాలామంది ఉన్నారు. బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా కాజల్ అగర్వాల్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ పరువు మొత్తం తీసేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్, టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడే సినిమా చేసింది. ‘లక్ష్మీ కళ్యాణం’ అనే తెలుగు మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ.. రాజమౌళి ‘మగధీర’తో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో దాదాపు ప్రతి టాప్ హీరోతోనూ నటించేసింది. 2020లో పెళ్లి చేసుకోవడానికి ముందు వరకు వరసపెట్టి మూవీస్ చేసింది. పిల్లాడు పుట్టడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. తాజాగా రీఎంట్రీ ఇచ్చేసింది. బాలయ్య కొత్త సినిమాలో హీరోయిన్ గా చేస్తూ బిజీగా మారిపోయింది.
సరే ఇదంతా పక్కనబెడితే.. తాజాగా ‘రైజింగ్ ఇండియా’ పేరుతో ఓ ప్రోగ్రాంని నిర్వహించారు. ఇందులోనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా కాజల్ కెరీర్ గురించి చాలా విషయాలు మాట్లాడింది. సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్ మధ్య ఎలాంటి తేడా ఉంటుందనేది చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది. ‘దక్షిణాది చిత్రపరిశ్రమలో విలువలు, క్రమశిక్షణతో పాటు న్యాయం కూడా ఉంటుంది. అదే బాలీవుడ్ లో చూసుకుంటే అవి పెద్దగా ఉండవు’ అని యాంకర్ అడిగిన క్వశ్చన్ కు బదులిస్తూ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కాజల్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.