హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఖరీదైన ఆ వస్తువులు కనిపించకుండా పోయాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఏం జరిగింది?
సెలబ్రిటీలకు కూడా దొంగతనం కష్టాలు తప్పట్లేదు. ఎందుకంటే ఈ మధ్య వరసగా సినీ స్టార్స్ ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే. కొన్నిరోజుల ముందు సూపర్ రజనీకాంత్ ఇద్దరు కూతుళ్ల ఇళ్లలో నెల రోజుల వ్యవధిలో దొంగతనాలు జరిగాయి. సరే అయిపోయిందేదో అయిపోయింది. దొంగలు దొరికినట్లున్నారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలి ఇంట్లో దొంగలు పడ్డారు. ఖరీదైన వస్తువులు చోరీకి గురయ్యాయి.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త బయటకొచ్చింది.
అసలు విషయానికొచ్చేస్తే.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు చెల్లెలు అర్పితా అంటే చాలా ఇష్టం. సొంత సోదరి కాకపోయినప్పటికీ చాలా ప్రేమ చూపిస్తుంటాడు. వీళ్ల బాండింగ్ గురించి చాలామంది తెలుసు. ఆయుష్ శర్మని పెళ్లి చేసుకున్న అర్పితా ప్రస్తుతం ఫ్యామిలీతో ఆనందంగా ఉంది. అలాంటి ఆమె ఇంట్లో తాజాగా చోరీ జరిగింది. ఆర్పితా చెవి పోగులు పోయినట్లు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీటి విలువ రూ.5 లక్షలకు పైనే ఉంటాయని, వాటిని వజ్రాలతో చేసినట్లు ఈమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తన మేకప్ ట్రేలో వాటిని పెట్టానని.. కానీ ఇప్పుడవి కనిపించకుండా పోయావని ఆమె తెలిపారు.
ఆర్పితా ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు.. ఇది ఇంటి దొంగల పని అని తేల్చారు. ఈమె ఇంట్లో పనిచేస్తున్న సందీప్ హెగ్డేనే దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతడి నుంచి అర్పితా చెవి పోగుల్ని రికవరీ చేసుకున్నారు. అర్పితా ఖాన్ ఇంట్లో 11 మంది పనివాళ్లు ఉన్నారు. ఇందులోని సందీప్.. చోరీ జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడిపై అనుమానం వచ్చి.. ట్రేస్ చేసి మరీ పోలీసులు పట్టుకున్నారు. సో అదన్నమాట విషయం. సెలబ్రిటీల ఇళ్లకే భద్రత లేకుండా పోవడం.. ఈ మధ్య కాలంలో ఆయా స్టార్స్ ఇళ్లలో వరస దొంగతనాలు జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి సల్మాన్ చెల్లెలు ఇంట్లో చోరీపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Maha |A man namely Sandeep Hegde (30) had stolen the diamond earrings of #SalmanKhan‘s sister #ArpitaKhan from her house on May 16. Police have arrested the accused. The earrings were worth Rs 5 lakh. Sandeep Hegde was working in Arpita Khan’s house as a house help: #Nukkadlive pic.twitter.com/Yz1tfRj0ip
— Nukkad Live (@Nukkadlive1) May 17, 2023