స్టార్ యాక్టర్స్ అయిన అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ చిక్కుల్లో పడ్డారు. తాజాగా జరిగిన ఓ విషయమై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏంటి సంగతి?
అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ.. హిందీ మూవీస్ చూసేవాళ్లకు వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 70 ఏళ్ల వయసులోనూ చకచకా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అమితాబ్, మరోవైపు హీరోయిన్ గా చేస్తూ, పలు సినిమాలు/సిరీసులు నిర్మిస్తూ.. మిగిలిన టైంలో భర్త కోహ్లీకి సపోర్ట్ చేస్తూ అనుష్క శర్మ బిజీ. అలాంటిది ఈ ఇద్దరూ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఓ విషయమై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా నటులు, సెలబ్రిటీలు ఏం చేసినా సరే జనాలు అన్నింటినీ గమనిస్తుంటారు. ఏదో స్టార్స్ అని లైక్ కొట్టి ఊరుకోరు. తప్పు చేస్తే నిలదీసే వాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు అమితాబ్, అనుష్క శర్మ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా ఓ షూటింగ్ కి లేట్ అవుతుందని, కారులో నుంచి దిగి బైక్ పై లిఫ్ట్ అడిగి అమితాబ్ లొకేషన్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేశారు. మరో సందర్భంలో తాజాగా అనుష్క శర్మ కూడా ఇలానే హెల్మెట్ లేకుండా జర్నీ చేసింది.
ఇలా రెండు సందర్భాల్లోనూ అదీ కూడా అమితాబ్, అనుష్క శర్మ లాంటి స్టార్స్ నిబంధనలు అతిక్రమించేసరికి పలువురు నెటిజన్స్.. ముంబయి పోలీసులని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు.. సదరు స్టార్ యాక్టర్స్ పై సీరియస్ అయ్యారు. దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బహుశా హెల్మెట్ ధరించనందుకు ఫైన్ వేస్తారని తెలుస్తోంది. ఏదేమైనా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లు ఇలా ప్రవర్తిస్తే ఎలా అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మరి దీనిపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.