నటి సత్యకృష్ణన్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అరవైకి పైగా సినిమాలు చేసిన ఈ నటి.. ఒకప్పుడు యాక్టీవ్ గా ఉన్నట్లుగా ఇప్పుడు సినిమాలలో కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా సత్యకృష్ణన్ కూతురికి సంబంధించి కొత్తగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు ప్రేక్షకులకు నటి సత్యకృష్ణన్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అరవైకి పైగా సినిమాలు చేసిన ఈ నటి.. ఒకప్పుడు యాక్టీవ్ గా ఉన్నట్లుగా ఇప్పుడు సినిమాలలో కనిపించడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తోంది.. కానీ, ఈ మధ్యకాలంలో నటిగా ఎలాంటి బిగ్ బ్రేక్ అయితే రాలేదని చెప్పాలి. అందుకే వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఆనంద్, బొమ్మరిల్లు, ఉల్లాసంగా ఉత్సాహంగా, మెంటల్ కృష్ణ లాంటి సినిమాలు సత్యకృష్ణన్ కి నటిగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. కానీ.. చిన్న చిన్న రోల్స్ వరకే పరిమితం అయిపోయింది. అదీగాక సినిమాలలో తప్ప బయట సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండే రకం కాదు సత్యకృష్ణన్. కొంతకాలంగా సినిమాల నుండి బ్రేక్ అయితే తీసుకోలేదు. కానీ, తెరపై రేర్ గా కనిపిస్తోంది. పైగా ఎప్పుడూ తన ఫ్యామిలీ విషయాలు కూడా బయటికి చెప్పుకోలేదు.
ఈ క్రమంలో.. తాజాగా సత్యకృష్ణన్ కూతురికి సంబంధించి కొత్తగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తల్లిని మించిన అందంతో సత్య కూతురు అనన్య కృష్ణన్.. నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. చూస్తుంటే.. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. సత్య కూతురు అనన్య ఆల్రెడీ తెలుగులో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ మూవీతో డెబ్యూ చేసింది. రీసెంట్ గా ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ’ అనే సినిమాలో కూడా కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరి మున్ముందు హీరోయిన్ గా సినిమాలు చేయనుందా? లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనన్యకి సంబంధించి పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అనన్య సోషల్ మీడియాకి కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయట్లేదని సమాచారం. మరి సత్యకృష్ణన్ కూతురు అనన్య ఇండస్ట్రీలో రాణించే అవకాశాలు ఉన్నాయా లేదా? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.