Sanghavi: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఎన్నో ఏళ్లుగా చిత్రపరిశ్రమలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, హీరోయిన్లను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతోమంది సినీతారలు కొంతకాలానికే విడాకులు తీసుకొని రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే.. ఆరేళ్ళ క్రితం ఓ సాఫ్టువేర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిన సీనియర్ హీరోయిన్.. గతంలో ఓ డైరెక్టర్ ని పెళ్లాడిందనే సంగతి ఇంతకాలం రహస్యంగా దాగుతూ వచ్చింది.
మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? గతంలో మొదటి పెళ్లి ఏ డైరెక్టర్ తో జరిగింది? ఎందుకు విడిపోయింది? అనే వివరాల్లోకి వెళ్తే.. నటి సంఘవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి, ముప్పైకి పైగా సినిమాలు చేసింది. ముఖ్యంగా 1995 నుండి 2005 వరకూ హీరోయిన్ తెలుగులో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
కర్ణాటక మైసూర్ కి చెందిన సంఘవి.. మొదట తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో తాజ్ మహల్ మూవీతో అడుగుపెట్టింది. అప్పటినుండీ సంఘవి తమిళం కంటే తెలుగులో ఎక్కువగా బిజీ అయిపోయింది. ఈ క్రమంలో 1998లో తెలుగు రాజశేఖర్, సంఘవి జంటగా రూపొందిన ‘శివయ్య’ సినిమా మంచి హిట్ అయ్యింది. అయితే.. శివయ్య మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ సురేష్ వర్మతో ప్రేమలో పడిందట సంఘవి.
ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని, కానీ పలు కారణాల వలన కొద్దిరోజులకే విడిపోయారని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయం గురించి సంఘవి కూడా ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. సినిమాలకు దూరమయ్యాక సంఘవి 2016లో వెంకటేష్ అనే సాఫ్టువేర్ ని పెళ్లి చేసుకుంది.
ఇక 2020లో సంఘవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలా కూతురు, భర్తతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది సంఘవి. అనంతరం చాలా గ్యాప్ తర్వాత తెలుగులో జబర్దస్త్ అనే కామెడీ షోలో కనిపించింది. అలాగే కొలాంజి అనే తమిళ సినిమాలో చివరిసారిగా సంఘవి సినీ ప్రేక్షకులను పలకరించింది. మరి నటి సంఘవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Actress #Sanghavi Wedding Photos https://t.co/LSnOKltKjn pic.twitter.com/uGJVdV5V3t
— ValaiPechu Sakthivel (@dearshakthi) February 3, 2016