రేణూ దేశాయ్…దక్షిణాది పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. బద్రి సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది ఈ సుందరి. ఇక మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులే కొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో పవన్ రేణూ దేశాయ్ మధ్య ప్రేమ చిగురించటంతో వీరి ప్రయాణం పెళ్లి వరకూ వెళ్లింది. ఇక బద్రి సినిమా తర్వాత పెద్దగా సినిమాలో రాణించలేదు రేణూ దేశాయ్. దీంతో కొన్ని రోజుల తర్వాత వీరిద్దరికి కొడుకు అకిరా నందన్ జన్మించాడు. అలా కొంత కాలం పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ సహజీవనం సాఫిగానే కొనసాగింది.
ఇక కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకుని వారి వివాహ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. అలా కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకోవటం అలా సాగుతూనే ఉంది. ఇక విషయం ఏంటంటే..రేణూ దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో కాస్త ఆక్టివ్‌గానే ఉంటారు. తరుచు సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల స్పందిస్తుంటుంది. ఇదే కాకుండా వాణిని వినిపిస్తూ తన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా రేణూ దేశాయ్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా లైవ్‌లోకి వచ్చారు.
దీంతో తన ఫ్యాన్స్ కూడా తన లైవ్‌లోకి జాయిన్ అయి రేణూని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. అందరితో మాట్లాడక చాలా రోజులవుతోందని, పలకరించటానికి వచ్చానని తెలిపింది. ఆ తర్వాత కొంత మంది నెటిజన్లు మీరు చాలా అందంగా ఉన్నారని, ఇప్పటికీ కూడా మీ గ్లామర్ చెక్కుచెదరలేదని కామెంట్స్ చేశారు. ఇక సినిమాల్లోకి రావాలని కూడా అడిగారు. దీనికి రేణూ దేశాయ్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, నా వయసేంటి..మీరు మాట్లాడుతున్న మాటలేంటి అని సిగ్గుపడుతూ సమాధానమిచ్చారు. నా అందం ఇంకా ఏం లేదని, అంతా అయి పోయిందని తెలిపింది. ఇంకా ఇవే కాకుండా అకిరా సినిమా ఏంట్రీ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు.