స్టార్ యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పంచ్ డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె క్యాష్ అనే ప్రోగ్రాంకి హోస్ట్ గా చేస్తూ అందరిని అలరిస్తుంది. ప్రతివారం అతిథులతో కలసి షోలో సందడి చేస్తుంది. తాజాగా ఈ వారం హీరోలు పృథ్వి, వెంకట్, రోహిత్.. అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమ.. క్యాష్ ప్రోగ్రాంకి అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
నటుడు పృథ్వి, వెంకట్, రోహిత్,హీరోయిన్ ప్రేమ ల అల్లరితో క్యాష్ ప్రోగ్రాం సరదాగా సాగినట్లు ఉంది. వీరందరికి సుమ చిన్న టాస్క్ ఇచ్చింది. టాస్క్ లో భాగంగా ఒక సినిమాలో హీరోయిన్ ప్రేమ కూరగాయలు కోస్తుంటే వేలు తెగుతుంది. ప్రేమించే భర్తగా మీ రియాక్షన్ ఇవ్వాలని వెంకట్ కి సుమ చెప్తుతుంది. సుమ టాస్క్ ఇవ్వడమే ఆలస్యం.. హీరో వెంకట్ ఆ క్యారెక్టర్ లో లీనమైపోయాడు. ప్రేమ భర్తలా ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి.. ఆమె వేలుని నోటిలోకి తీసుకోబోయాడు. అయితే స్టేజ్ పై జరుగుతున్న ఆ ఫన్నీ రొమాన్స్ ని తట్టుకోలేక అంతా కేకలు వేయడంతో ఈ జంట టాస్క్ లో నుండి బయటకి వచ్చారు. ఏదేమైనా.. చాలారోజుల తరువాత ప్రేక్షకుల ముందుకి వచ్చిన వెంకట్, ప్రేమ.. ఇలా క్యాష్ పోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను అలరించడం విశేషం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.