తెలుగు తెరపై ఎప్పటికప్పుడు ఎంతోమంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో కొందరు స్టార్స్ గా ఫేమ్ తెచ్చుకుని సెటిలైపోతారు. మరికొందరు.. అటు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే, మరోవైపు రియాలిటీ షోల్లో కనిపిస్తారు. అలా కెరీర్ పరంగా బాగానే ఉంటారు. ఓ స్టేజీ వచ్చిన తర్వాత ఎంచక్కా పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. అలాంటి వారిలో హీరోయిన్ పూర్ణ ఒకరు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె.. తాజాగా గుడ్ న్యూస్ బయటపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ కుట్టి పూర్ణ, ‘శ్రీమహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ లో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా ‘సీమటపాకాయ్’, అవును, అవును 2, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలు చేసింది, రాజుగారి గది, శ్రీమంతుడు, సిల్లీ ఫెలోస్, అదిగో, సువర్ణ సుందరి, పవర్ ప్లే, తీస్ మార్ ఖాన్, అఖండ, దృశ్యం 2 లాంటి మూవీస్ లోనూ స్పెషల్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’లో కీలక పాత్ర పోషించింది. మరోవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ జడ్జిగా సందడి చేసింది.
కెరీర్ పరంగా బిజీగా ఉన్న పూర్ణ.. గతేడాది జూన్ 12న దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా సినిమాలు, షోలకు దూరమవుతూ వచ్చింది. ఆమె చేతిలో ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులే ఉన్నాయి. వాటిని ఆల్రెడీ కంప్లీట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు తల్లి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. అందుకు సంబంధించిన తన కుటుంబసభ్యులతో చేసుకున్న సెలబ్రేషన్ ని యూట్యూబ్ లో వీడియో తీసి పోస్ట్ చేసింది. దీన్నే తన ఇన్ స్టా స్టోరీలోనూ షేర్ చేసింది.