సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అందమైన ప్రేమ కావ్యాన్ని పెళ్లిబంధంతో పదిలపరుచుకున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత ఈ జంట హనీమూన్ కి థాయిలాండ్ కి వెళ్లింది. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చి తన సినిమా షూటింగ్ లో పాల్గొంది నయనతార. పెళ్లి సమయంలో విఘ్నేష్ కు నయనతార ఖరీదైన బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు నయన్-విఘ్నేష్ దంపతులు తమ కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నారు. అయితే ఆ ఇంటి ఇంటీరియర్ కే నయన్ భారీగా ఖర్చు పెట్టబోతున్నారు. రూ.25 కోట్లు కేవలం కొత్త ఇంటి ఇంటీరియల్ కే ఖర్చు పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఎక్కువగా సెలబ్రిటీలు నివసిస్తుంటారు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో కూడా ఉండేది అక్కడే. ఇటీవల నయనతార కూడా పోయెస్ గార్డెన్ లో ఓ ఇల్లు కొనుక్కుంది. తన భర్త విఘ్నేష్ తో కలిసి కొత్తింటికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. నయనతార కొన్న ఈ ఇల్లు దాదాపు 8000 చదరపు అడుగుల స్థలం ఉంటుందని టాక్. అయితే ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనులు చేయించేందుకు ఈ భామ సిద్ధమైంది. అందుకోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతోంది. దీనికోసం బాలీవుడ్ సెలెబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్.
దీనికోసం రూ.25 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతుందట నయనతార. ఈ ఇంట్లో స్విమ్మింగ్‌పూల్, నయనతార, విఘ్నేష్‌శివన్ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్, ఇతర పనివాళ్లకు మరో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నయన్-విఘ్నేష్ దంపతులు ఈ కొత్త ఇంట్లోకి మారనున్నారు. మరి..నయనతార కొత్త ఇంటీరియర్ కే భారీగా ఖర్చుపెడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.