హీరోలతో సమానంగా నటిస్తున్నప్పటికీ.. వారితో పోల్చకుంటే రెమ్యునరేషన్‌తో పాటు సదుపాయాలు తక్కువ. అటువంటి సినిమా పరిశ్రమలోకి వచ్చిన ధ్రువ తార నయన తార. ఆమె వ్యవహార శైలి మిగిలిన నటీమణులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. రెమ్యునరేషన్ విషయంలో కూడా దక్షిణాది స్టార్ హీరోలతో సమానంగా తీసుకున్న నటిగా మారింది.
హీరోలతో సమానంగా నటిస్తున్నప్పటికీ.. వారితో పోల్చకుంటే రెమ్యునరేషన్‌తో పాటు సదుపాయాలు తక్కువ. అటువంటి సినిమా పరిశ్రమలోకి వచ్చిన ధ్రువ తార నయన తార. ముందుగా మలయాళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రముఖ హీరో శరత్ కుమార్ నటించిన అయ్యా సినిమాతో కోలీవుడ్‌లోకి, వెంకటేష్ నటించిన లక్ష్మీ ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అనేక సినిమాల్లో నటించి స్టార్ హోదాకు చేరుకుంది. ఆమె వ్యవహార శైలి మిగిలిన నటీమణులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సినిమా ప్రమోషన్లకు, ఇంటర్వ్యూలకు రాదు. అలాగే ఇప్పుడు యాడ్స్ చేస్తుంది కానీ.. ఒకప్పుడు వాటిల్లో నటించేది కాదు. చీర కట్టులో ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. రెమ్యునరేషన్ విషయంలో కూడా దక్షిణాది స్టార్ హీరోలతో సమానంగా తీసుకున్న నటిగా మారింది. ఆమె చాలా మంది యంగ్ జనరేషన్ హీరోయిన్లకు ఆదర్శంగాను నిలిచింది.
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి బడా హీరోలతో నటించింది. అదేవిధంగా తమిళంలో కూడా రజనీకాంత్, అజిత్, మలయాళంలో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఓ రకంగా చెప్పాలంటే.. ఆమె స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమా ప్రమోషన్లకు రాదని తెలిసినా కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కడుతుంటారు. అందుకే ఆమె రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా రాజీ పడేది కాదు. వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులా సాగి.. ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయన తారపై డైరెక్టర్ పార్టిబన్ ఓ సారి సీరియస్ అయ్యారట. అది కూడా ఓ షూటింగ్ సందర్భంగానట. ఈ విషయాన్ని పార్తీబన్ స్వయంగా ఇటీవలే వెల్లడించారు.
నటుడు కమ్ డైరెక్టర్ పార్తీబన్ తెరకెక్కించాల్సిన ‘కుడైకుళ్ మజై’ సినిమాకు ముందుగా నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారట. అయతే సినిమా ఆడిషన్స్ కోసం ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పగా రాలేదట. అదే రోజు సాయంత్రం 8 గంటలకు కాల్ చేస్తే.. ‘నిన్న రాత్రి బయలు దేరలేదండీ.. ఈ రోజు రాత్రి బయలు దేరి వస్తానని’ చెప్పడంతో చిర్రెత్తుకొచ్చిందట పార్తీబన్‌కు. దీంతో కోపంతో ఇక నువ్వు రావొద్దు అని చెప్పానని అన్నారు పార్తీబన్. ఒకప్పుడు షూటింగ్స్ కోసం బస్సులో ప్రయాణించే నయనతార.. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆయన. ఆమె ఎదుగుదల చూసి ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. పనిపట్ల ఆమెకున్న నిబద్దతను చూసి.. ఆమెతో కలిసి నటంచే ఛాన్స్ మిస్ చేసుకున్నానని బాధపడుతున్నానని పార్తీబన్ అన్నారు.