ఆషు రెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్ లో క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించికుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అనేక షోల్లో తన అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడు బుల్లితెరపైనే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించి.. వెండితెరపై మెరిసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అషూరెడ్డి.. తనకు సంబంధించిన విషయాలను ఎపటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు... అదిరిపోయే సమాధానం ఇచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఇదీ చదవండి: KCPDకి కొత్త డెఫినేషన్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ! చూడటానికి అచ్చం సమంతలా ఉండడంతో అషు రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో ఈ అమ్మడు నటించి ఫేమస్ అయిపోయింది. ఇలా సోషల్ మీడియా ద్వారా, బుల్లితెర ద్వారా, సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అషూ రెడ్డి.. సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోయడంలో కూడా వెనకడుగు వేయదు. ఎప్పటికప్పుడు తన హాట్ అందచందాలతో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తుంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది. అషూ రెడ్డి అప్పుడప్పుడు సోషల్ మీడియా లైవ్ లో కూడా పాల్గొంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ బూతు మాట వాడి...దానికి అర్ధం చెప్పారా ప్లీజ్ అని అషూ రెడ్డిని అడిగాడు. దీనికి అషు రెడ్డి తెలివిగా సమాధానం ఇచ్చింది. "సరే మరి.. ఉంటా. వచ్చి ఆఫీసులో కలువు" అని రిప్లయ్ ఇస్తూ కోపంగా ఉండే సింబల్ ఎమోజీని పోస్టు చేసింది. తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో కేసీపీడీ పేరుతో ఒక సీన్ ఉంది. అంతేకాకుండా కేసీపీడీ అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఉంటుంది. ఆ సీన్, కేసీపీడీ అనే పదం ఇప్పుడు మరోసారి నెట్టింట చర్చకు వచ్చింది. అంతేకాకుండా గాడ్ ఫాదర్ సినిమా సందర్భంగా ఆ పదానికి సెర్చ్ కూడా పెరిగింది. అదే సందర్భంలో గతంలో అషూరెడ్డిని నెటిజన్ అడిగిన ప్రశ్న మరోసారి వైరల్ గా మారింది. #AshuReddy pic.twitter.com/ZGuzVe0HbD — Hardin (@hardintessa143) July 7, 2022