ప్రతి మనిషి జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలతో పాటు వెంటాడే పీడకలలూ ఉంటాయి. కొందరు ఆ పీడకలలను దాటుకుని.. ముందుకు సాగి.. జీవితంలో విజయం సాధిస్తారు. మరికొందరు చేదు అనుభవాలను తల్చుకుని.. వేదనకు గురయ్యి.. జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇక ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి చేదు అనుభవాలు తప్పకుండా ఉంటాయి అనడంలో అతశయోక్తి లేదు. అందుకు సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. వెండితెరపై మేకప్ వేసుకుని నవ్వుతూ కనిపించినా.. ఆ చిరునవ్వు వెనక ఎంతో విషాదాన్ని గొంతులోనే ఆపేస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. బాధితులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం ఈ జాబితాలోకి నటి కుబ్ర సైత్ కూడా చేరారు. ఎన్నో ఏళ్లుగా భరిస్తున్న బాధను ఎట్టకేలకు బయటపెట్టి కొంత భారాన్ని తగ్గించుకుంది. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నోటితో కాకపోయినా తను రాసిన ఓపెన్ బుక్: నాట్ క్వైట్ ఎ మెమోయిర్ అనే పుస్తకంలో ఎంతోకాలంగా అనుభవిస్తున్న వేదనను బయటపెట్టింది.
ఇది కూడా చదవండి: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి అవసరమా? వాడు చాలా మారాలి! ధనరాజ్ షాకింగ్…
ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘అప్పుడు నాకు 17 ఏళ్లు. మా ఫ్యామిలీ అంతా కలిసి బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కు తరచూ వెళ్తూ ఉండే వాళ్లం. అలా ఆ రెస్టారెంట్ యజమాని మా కుటుంబానికి దగ్గరయ్యాడు. మా అమ్మకు ఆర్థికంగా సాయం కూడా చేశాడు. ఆ తర్వాతే అతడిలోని అసలు రూపాన్ని బయటపెట్టాడు. కారులో కూర్చొన్నప్పుడు నా తొడ మీద చేయి వేసి నిమిరుతూ, అసభ్యంగా తాకుతూ వేధించడం మొదలుపెట్టాడు. నేను అంకుల్ అని పిలిస్తే కూడా అలా పిలవొద్దని వారించాడు’’ అని రాసుకొచ్చింది.
‘‘అతడు తరచూ మా ఇంటికి కూడా రావడం మొదలుపెట్టాడు. అమ్మ అతడికి వంట చేసి పెట్టేది, నవ్వుతూ మాట్లాడేది. ఆమె ముందే అతడు నా బుగ్గ మీద ముద్దు పెడుతూ నువ్వు నాకెంతో ఇష్టం తెలుసా? అని కబుర్లు చెప్పేవాడు. నాకు అసౌకర్యంగా అనిపించినా ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయేదాన్ని. ఓసారి నన్ను హోటల్‌కు తీసుకెళ్లి నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకయ్యాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ క్షణం గట్టిగా అరవాల్సింది, సాయం కోసం పరిగెత్తాల్సింది. కానీ షాక్‌లో ఉండిపోవడంతో నా నోటి నుంచి చిన్న మాట కూడా పెగల్లేదు. అతడు అలానే నాకు ముద్దులు పెడుతూనే తనకు నచ్చింది చేసుకుంటూ పోయాడు. నా వర్జినిటీ కోల్పోయాను. ఇదే నా జీవితంలో అత్యంత సిగ్గుచేటు రహస్యం’’ అని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Rana: సాయిపల్లవి కోసం తనని తాను తగ్గించుకున్న రానా! ఫోటో వైరల్!
‘‘ఇలా రెండున్నరేళ్లపాటు అతడు లైంగికంగా వేధించాడు. అతడు డబ్బులు పంపించడం ఆపివేసినప్పుడు ఎందుకు అతడితో గొడవపడుతున్నావని మా అమ్మ నన్నే తిట్టేది. నేను అతడికి అడ్డు చెప్తే నా కుటుంబంతో మాట్లాడటమే కాదు, సాయం చేయడం కూడా మానేస్తాడు. పైగా ఈ విషయం మా ఇంట్లో చెప్తే మా కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. అందుకే నా బాధను, అనుభవించిన క్షోభను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఆ సమయంలో నేను జీవచ్చవంలా బతికాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా కుబ్ర నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో నటించింది. నటికి ఎదురైన చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Brahmanandam: F3 మూవీపై బ్రహ్మానందం కామెంట్స్.. వీడియో వైరల్!