సోషల్ మీడియా వినియోగం సెలబ్రిటీలకు ఎంతో మేలు చేస్తుంది. తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ని వెంటనే ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవడానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది. ఇక తాజాగా నటి ఇంద్రజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఇంద్రజ.. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూనే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంట షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ ప్రత్యేకంగా అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, ఇటు బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఇంద్రజ.
సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు ఇంద్రజ. కొత్త కొత్త ఫోటోలు, రీల్స్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంద్రజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరలవుతోంది. పుట్టపర్తి సాయిబాబా నా వైపు తిరిగి చేశారు.. ఓ మై గాడ్.. నా జన్మ ధన్యం అయ్యింది అంటూ ఇంద్రజ పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
పుట్టపర్తి సాయిబాబా ఏంటి.. ఇంద్రజ వైపు తిరిగి చూడటం ఏంటి అనిపిస్తుంది కదా. అయితే ఇది ఫ్యాన్స్ క్రియేటివ్ వర్క్. దీని గురించి ఇంద్రజ ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ఇది నాకు చాలా స్పెషల్ ఫొటో. ఓసారి యూట్యూబ్‌లో సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ రీల్ కనిపించింది. ఇది క్రియేట్ చేసిన వారు ఎవరో కానీ.. చాలా అద్భుతంగా చేశారు. దీనిలో నేను ఇటువైపు నవ్వుతున్నట్లుగా ఉంటే.. అప్పుడు సాయిబాబా నా వైపు చూస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. ఈ ఫొటోలో సాయి బాబా ఒక దగ్గర నా వైపు చూస్తున్నట్లుగా ఉంటే.. మరో ఫొటోలో ఎదురుగా చూస్తున్నట్లుగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ఈ ఫొటో చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది. నేను రోజు కొలిచే దైవం నిజంగానే నా వైపు చూసినట్లుగా అనిపించింది. నాకు పుట్టపర్తి సాయిబాబా అంటే ఎంతో భక్తి. ఈ ఫొటో చూడగానే నాకు ఎంతో నచ్చింది.. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని భావించాను. అందుకే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను’’ అన్నారు ఇంద్రజ. ఈ వీడియోపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు ధన్యులు అని కొందరు కామెంట్ చేస్తే.. దానిలో ఏముంది.. క్రియేట్ చేసిన ఫొటో కదా దానికి అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ మరొ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.