సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ లు అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనే వాదన ఉంది. అయితే ఈ వాదనను బద్దలు కొడుతు అనుష్క, సమంత, నయనతార లాంటి మరికొందరు హీరోయిన్ లు లేడీ ఓరియోంటెడ్ పాత్రలు చేస్తూ.. ఆ వాదనను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అందాల ఆరబోతతోనే సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తుందని సదరు బ్యూటీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్ లన్నింటికి ఒకేఒక్క వీడియోతో జవాబు ఇచ్చింది హీరోయిన్ దర్శాగుప్తా. కేవలం గ్లామర్ తోనే అవకాశాలు రావని ఈ వీడియో ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చింది.
దర్శాగుప్తా.. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయ అయిన హీరోయిన్లలో తను కూడా ఒకరు. ‘కుక్ విత్ కోమాలి’ అనే బుల్లితెర కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది దర్శా. ఇక కరోనా కాలంలో తన మంచి మనసును చాటుకుంది. తనకు చేతనైనంత ఇతరులకు సాయం చేసింది. అయితే దర్శాగుప్త సోషల్ మీడియాతో తెగ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. ఈ పిక్స్ పెట్టడంతోనే ఈ అమ్మడుకు ట్రోల్స్ ఎదురైయ్యాయి. కేవలం గ్లామర్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
దాంతో వారందరికి ఒకేఒక్క వీడియోతో సమాధానం చెప్పింది దర్శాగుప్త . హీరోయిన్ లు అంటే కేవలం గ్లామర్ కే పరిమితం కారని, పాత్ర కోసం మేం ఎంత కష్టపడతామో చూడండి అంటూ డూప్ లేకుండా చేసిన ఫైట్ వీడియోను తన ఇన్ స్టా లో షేర్ చేసింది. తాజాగా విడుదలైన ఓ మై ఘోస్ట్ లో చిత్రంలో కీలకమైన పాత్రలో దర్శాగుప్త నటించింది. ఈ చిత్రంలోని ఓ షూటింగ్ సన్నివేశాన్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “కేవలం ఈ షాట్ కోసమే నేను ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఏమీ తినలేదు, తాగలేదు. కష్టపడనిదే ఏదీ రాదు. లవ్ యూ ఆల్” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం దర్శా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.