ప్రముఖ బుల్లితెర నటి రెండో పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఆమె చేసుకున్న అతడికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్ కావడం గమనార్హం.
సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు, విడాకులు, డేటింగ్ లు, ప్రేమలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకున్న నటుడు,నటి అన్న వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మెుదటి భర్త, భార్యతో అభిప్రాయా బేధాలు రావడంతో.. చాలా జంటలు విడాకులు తీసుకుని తమ జీవితాన్ని మళ్లీ కొత్తగా మెుదలు పెడుతున్నారు. తాజాగా మరో జంట రెండో పెళ్లి చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దల్జీత్ కౌర్.. ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి. తన నటనతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక ఇండస్ట్రీలో నటిస్తుండగానే.. షాలిన్ భానోత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. అతడు ఇటీవలే బిగ్ బాస్ 16లో పాల్గొన్నాడు. ఇక వీరికి 2014లో ఓ బాబు పుట్టాడు. ఇద్దరి మధ్య అభిప్రాయా బేధాలు రావడంతో.. వారు విడిపోయారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఆమె నిఖిల్ పటేల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇక ఇది ఆమెకు రెండో పెళ్లి కాగా.. నిఖిల్ కు కూడా రెండో వివాహం కావడం గమనార్హం. ఇది వరకే నిఖిల్ కు పెళ్లి జరిగింది. అతడికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇక దుబాయ్ లో జరిగిన ఓ పార్టీలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. ఇద్దరు జనవరిలో నేపాల్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తాజాగా వీరు పెళ్లితో వైవాహిక జీవితంలోకి మరోసారి అడుగుపెట్టారు. బంధువులు, సెలబ్రిటీల మధ్య వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. దాంతో ఈ కొత్త జంటకు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు