Krishnam Raju: ప్రముఖ సీనియర్ టాలీవుడ్ నటుడు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ ఉదయం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఊపిరితీత్తుల సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు స్వర్గస్తులయ్యారు. కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపై సినిమా ప్రముఖులందరూ సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు ప్రముఖులు వరుసగా ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న ప్రముఖ హీరోయిన్ అనుష్క దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ కృష్ణంరాజు భౌతికదేహాన్ని సందర్శించారు. కాగా, కృష్ణంరాజు మరణంపై కేవలం సినీ పరిశ్రమనుంచే కాదు. రాజకీయ వర్గాలనుంచి కూడా భారీగా సంతాపాలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ సంతాపాన్ని తెలియజేశారు. కృష్ణంరాజు మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని అన్నారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరి, కృష్ణం రాజు మరణంపై మీ సంతాపాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
ఇవి కూడా చదవండి : కృష్ణం రాజు చివరి కోరిక అదే? తీరకుండానే ఆయన స్వర్గస్తులయ్యారు..