సోషల్ మీడియా వచ్చాక ఓవర్ నైట్ స్టార్లు అయిపోతున్నారు చాలా మంది. తమలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ఓ ఫ్లాట్ ఫామ్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో సోషల్ మీడియా సెలబ్రిటీలు ఎక్కువైపోయారు. ఈ క్రమంలోనే ‘కచ్చా బాదమ్’ సాంగ్ కు డ్యాన్స్ చేసి దేశవ్యాప్తంగా రచ్చలేపింది అంజలి అరోరా. దాంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్న అరోరా ఫాలోయింగ్.. కచ్చా బాదమ్ సాంగ్ రీల్ తో అమాంతం పెరిగిపోయింది. అదీకాక సమయం చిక్కినప్పుడల్లా కుర్రాళ్ల గుండెలకు గుండెపోటు తెచ్చేలా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి తన టాలెంట్ కు పనిచెప్పింది ఈ సోయగం. ఈసారి ఏకంగా అర్ధరాత్రి నడిరోడ్డుపై స్పింగ్ లా నడుమును తిప్పుతు తన డ్యాన్స్ తో మగాళ్లకు మత్తెక్కిస్తోంది.
అంజలి అరోరా.. కచ్చా బాదమ్ సాంగ్ కు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. స్వతాహాగా మోడల్ అయిన అరోరా తన అందచందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోది. యూట్యూబ్ లో వీడియో ఆల్బమ్ లు చేస్తు.. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా పంజాబ్ బాషలో ఈ బ్యూటీ సాంగ్స్ కు యమ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తోనే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లు సైతం చేసింది. తాజాగా అరోరా తు ఆజా అనే సాంగ్ కు నడి రోడ్డుపై అర్దరాత్రి వయ్యారాలు ఒలకపోసింది. నడుము ను స్వింగ్ లా తిప్పుతూ.. కుర్రాళ్లను తూ ఆజా అంటూ కవ్విస్తోంది.
ఇక నీశీది రాత్రిలో పండు వెన్నలలా దర్శనమిస్తూ.. తన చూపులతో, హావభావాలతో మగాళ్లకు నిద్ర కరువు చేస్తోంది అంజలి అరోరా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఇప్పటికే ఈ వీడియోకి 6 లక్షలకు పైగా లైకులు దక్కాయి. ఇక అంజలి అరోరాకి ఇన్ స్టా గ్రామ్ లో 12.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోని చూసిన అభిమానులు కచ్చా బాదం మళ్లీ చెయ్యోచ్చుగా అంటున్నారు. మరికొందరేమో మీ అందానికే కాదు మీ లుక్స్ కి, మీ ఎక్స్ ప్రెషన్ కు ఫిదా అయిపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.