సినిమా ఇండస్ట్రీలో నటీనటులు అవకాశం వచ్చి, తమను తాము నిరూపించుకోవడానికి ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. కానీ కొందరు ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తామంటూ కొన్ని పరిమితులు పెట్టుకుంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలో నటీనటులు అవకాశం వచ్చి, తమను తాము నిరూపించుకోవడానికి ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. కానీ కొందరు ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తామంటూ కొన్ని పరిమితులు పెట్టుకుంటున్నారు. దీని వల్ల అంతగా అవకాశాలు రాకపోవచ్చు. కొంతమంది యాక్టర్స్ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి.. యాక్షన్, కామెడీతో పాటు రొమాంటిక్ సీన్స్ చెయ్యడానికి కూడా వెనకాడరు. కొత్త ఆర్టిస్టులు కూడా ఇంటిమేట్ సీన్స్ చేయడం అనేది బాలీవుడ్లో అయితే సర్వ సాధారణమే. తాజాగా బాలీవుడ్ నటి అమృత సుభాష్ ఒక ఇంటర్వ్యూలో తనకెదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.
‘నేను ‘సేక్రేడ్ గేమ్స్ 2’ సిరీస్‌లో తొలిసారిగా శృంగార సన్నివేశాల్లో నటించాను. ఆ సీన్స్ చేయడానికి ముందు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నన్ను ఓ ప్రశ్న అడిగాడు. నీకు పీరియడ్ డేట్స్ ఎప్పుడని అడిగాడు. కొద్దిసేపటి వరుకు నాకేం అర్థం కాలేదు. తీరిగి నీ డేట్ ఎప్పుడో చెప్తే మనం ఇంటిమేట్ సీన్స్‌కు ఆ రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో షెడ్యూల్ సర్దుబాటు చేసుకుందాం అన్నాడు. డైరెక్షన్ టీమ్‌తో మాట్లాడి మార్పులు, చేర్పులు చేశాడు. అనురాగ్ చాలా సున్నిత మనస్తత్వం గలవాడు’ అని తెలిపింది అమృత సుభాష్.
కాగా ‘సేక్రేడ్ గేమ్స్’ రెండో సీజన్లో రా ఏజెంట్‌గా నటించింది అమృత. అలాగే కొంకణా సేన్ దర్శకత్వంలో ‘ద మిర్రర్’ లోనూ యాక్ట్ చేసింది. అయితే మొదట ఇందులో తన పాత్ర గురించి చెప్పినప్పుడు ఏదీ బుర్రకు ఎక్కలేదట. ఒకరకంగా అది మంచికే అంటుంది. తన పాత్ర గురించి పూర్తిగా తెలిసిపోతే రిలాక్స్ అయిపోతమాని, అదే కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంటే దాని గురించి తెలుసుకునేందుకు, లీనమై పోయేందుకు మరింత కష్టపడతామని చెప్పింది. ఏదేమైనా అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్‌లతో పుల్ బిజీగా గడిపేస్తుంది అమృత సుభాష్.