టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుబ్బరాజు. తనదైన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యరు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించాడు సుబ్బరాజు.
టాలీవుడ్ లో ఎంతో మంది గొప్ప గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఆ అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులలో కచ్చితంగా ఉంటాడు సుబ్బరాజు. ఖడ్గం సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన సుబ్బరాజు.. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. వివాదాలకు దూరంగా ఉండే సుబ్బరాజు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? అదీకాక డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సుబ్బరాజు.. తెలుగు చిత్ర సీమలో మోస్ట్ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు. చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఖడ్గం సినిమాతో మెుదలైన అతడి ప్రస్థానం ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మంచి ఫిట్ నెస్ తో అవకాశాలు కొల్లగొడుతున్నాడు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. దాంతో ఒక్కసారిగా వార్తలో నిలిచాడు సుబ్బరాజు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయాలతో పాటుగా పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పుకొచ్చాడు.
సుబ్బరాజు మట్లాడుతూ..”నేను రెగ్యూలర్ గా ఎక్సర్ సైజ్ చేస్తుంటాను. అందుకే ఇంత ఫిట్ గా ఉంటాను. లేదంటే ఏ నాన్న పాత్రలో, తాతయ్య పాత్రలో చేసుకోల్సి వస్తుంది. నాకు ప్రేమించి కొన్నాళ్లు ఆరాధించడం తప్ప అంతకుమించి నా జీవితంలో ఏమీ ఉండదు. ఇక పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు” అని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు. ఇక డ్రగ్స్ కేసులో నాకంటే ఎక్కువ నా తల్లిదండ్రులే బాధపడతారని నేను ఆందోళన చెందాను అని సుబ్బరాజు తెలిపారు. చుట్టు పక్కల వారు తలుపు తట్టి మరి మీ వాడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడంటగా అని అడుగుతారని బాధపడ్డాడు. అమ్మానాన్నకు ఎలా ధైర్యం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అని వాపోయాడు. ఇక డ్రగ్స్ కేసులో నన్ను జైల్లో వేసినా పోయేదేం లేదని ఈ సందర్భంగా సుబ్బరాజు చెప్పుకొచ్చాడు. ఇక నాకు మెుహమాటం ఎక్కవని, అందుకే డైరెక్టర్ల దగ్గరికి వెళ్లి క్యారెక్టర్లు ఇవ్వమని అడగబుద్ది కాదని సుబ్బరాజు అన్నారు. మరి సుబ్బరాజు చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.