టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుబ్బరాజు. తనదైన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యరు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించాడు సుబ్బరాజు.
సినిమాల్లో హీరో పాత్ర గొప్పగా రావాలంటే.. విలన్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే కథానాయకుడు అంత గొప్పవాడవుతాడు. ఇక పాత కాలంలో విలన్ అంటే.. మొరటుగా.. చూడగానే భయంకరంగా ఉండేవాడు. కానీ ఇపఉడు విలన్ కూడా హీరోకు ధీటుగా స్మార్ట్‌గా తయారయ్యాడు. ఇలా స్మార్ విలన్‌లో ముందు వరుసలో ఉంటాడు సుబ్బరాజు. క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. […]