సత్యరాజ్ టాలీవుడ్ కట్టప్పగా తనదైన నటనతో ఇటు తెలుగు, అటు తమిళం తో పాటు పలు భాషల్లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవ్వరికి తెలీదు. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని కట్టప్ప కూతురు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సోషల్ మీడియా వాడకం పెరిగాక ప్రతీ ఒక్కరు వెలుగులోకి వస్తున్నారు. అయితే కొంత మంది వెలుగులోకి వచ్చిందాక తెలీదు వారు సెలబ్రిటీల వారసులని, బంధువులని. అలా సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన వారు హీరోయిన్ లకు, హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటున్నారు. తాజాగా సత్యరాజ్ అలియాస్ కట్టప్ప కూతురుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో ఆమె ఫోటోలు చూసిన అభిమానులు.. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదుగా అని కాంప్లిమెట్స్ ఇస్తున్నారు.
సత్యరాజ్ అంటే కొంత మందికి ఎవరతను అని ఆలోచన రావొచ్చు. అదే కట్టప్ప అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఇక తనదైన నటనతో ఇటు తెలుగు, అటు తమిళం తో పాటు పలు భాషల్లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సత్యరాజ్ గతంలో హీరోగా ఓ వెలుగు వెలిగారు అన్న సంగతి ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇక సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవ్వరికి తెలీదు. సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి. ఇక కట్టప్ప దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే కొడుకు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి పేరు సిబిరాజ్.. డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.
అయితే తన కూతురు దివ్య సత్యరాజ్ గురించి అభిమానులకు పెద్దగా తెలీదు. ఎందుకంటే ఆమె ఎక్కువగా బయట తిరిగింది లేదు. ఇక దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం దివ్య సత్యరాజ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ లా ఉన్నారు సినిమాల్లోకి రావొచ్చు కదండి.. అని కొందరు అంటే.. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం మీది అంటూ మరికొందరు కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. మరి హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉన్న సత్యరాజ్ కూతురుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.