ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా.. అంటూ వెండితెరపై వెలిగిపోవాలని ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెంపర్లాడుతుంటారు. సినిమాల్లో ఒక్క ఛాన్సు దొరికితే సెలబ్రెటీ హోదా పొందుతారు. సినిమాల్లో ఛాన్సు దక్కించుకోవడానికి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది సినిమా ఛాన్సు రావడమే కాదు.. మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణంలో సినిమాలకు గుడ్ బై అంటూ సంచలనాలకు తెరలేపాడు ప్రముఖ కమెడియన్ రాహూల్ రామకృష్ణ.
ఇది చదవండి: వాళ్లిద్దరి కోసం ముందుకు వచ్చిన వరుణ్ తేజ్
ప్రముఖ దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో రాహూల్ రామకృష్ణ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన జాతి రత్నాలు చిత్రంలో కూడా రాహూల్ రామకృష్ణకు మంచి పేరు వచ్చింది. అలాంది రామకృష్ణ ఇక సినిమాలు చేయబోనని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. 2022 సంవత్సరం వరకే సినిమాలలో నటిస్తానని.. తర్వాత సినిమాలకు, నటకు దూరంగా ఉంటానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అంతేకాదు ఈ విషయంలో ఎవరూ చెప్పిన తను వినను అని కూడా క్యాప్షన్ పెట్టాడు.
ఇది చదవండి: తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత!
అర్జున్ రెడ్డి తో పాటు పలు సినిమాలలో కమెడియన్ నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని రాహుల్ రామకృష్ణ గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే.. కేరీర్ పీక్స్ లో ఉన్న సందర్భంలో రాహుల్ రామకృష్ణ ఈ నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. నటుడుగానే కాకుండా గీతరచయితగా కూడా మెప్పించాడు రాహుల్. .. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.
2022 is my last.
I will not do films anymore.
Not that I care, nor should anybody care— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022