సినీ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే అర్థాంతరంగా మరణించిన హీరోలు, హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కోట్లమంది అభిమానించే తారలు ఒక్కసారిగా కనుమూసేసరికి ఫ్యాన్స్ కూడా తట్టుకోలేరు. ఈ విషయంలో అభిమానులు బాధకు కొలమానం అనేది ఉండదనే చెప్పాలి. అయితే.. కొన్ని సినిమాలు ఆ స్టార్స్ మరణించాక రిలీజ్ అవుతుంటాయి. అలా రిలీజైన కొన్ని సినిమాల లిస్ట్ చూద్దాం!
1) పునీత్ రాజ్ కుమార్: గతేడాది గుండెపోటుతో మరణించారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు మార్చి 17న చివరి సినిమా జేమ్స్ విడుదలైంది.
2) సౌందర్య: హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాక ఆమె నుండి ఆప్తమిత్ర, శివశంకర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
3) అక్కినేని నాగేశ్వరరావు: ఆయన మరణించిన ఐదు నెలల తర్వాత ‘మనం’ సినిమా విడుదలైంది.
4) శ్రీహరి:చేతిలో చాలా సినిమాలు ఉన్నప్పుడే ఆయన మరణించారు. కంప్లీట్ చేసిన సినిమాలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ సి చేశారు.
5) ఆర్తి అగర్వాల్: ఆర్తి చనిపోయాక చివరి సినిమా ‘ఆమె ఎవరు’ విడుదలైంది.
6) సుశాంత్ సింగ్ రాజపుత్: తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాక.. ‘దిల్ బేచారా’ చిత్రం ఓటిటి రిలీజ్ అయింది.
7) ప్రత్యూష:ఆమె మరణాంతరం ‘సౌండ్ పార్టీ’ మూవీ విడుదలైంది.
8) రిషీ కపూర్: లెజెండరీ యాక్టర్ మరణించిన తర్వాత ‘శర్మాజీ నమ్కీన్’ విడుదలైంది.
9) దివ్యభారతి: ఈమె మరణం తర్వాత ‘తొలిముద్దు’ చిత్రం రిలీజ్ అయింది.
10) శ్రీదేవి: అందాలతార మరణాంతరం ‘జీరో’ సినిమా విడుదలైంది.
11) ఓం పూరి: లెజెండ్ చనిపోయాక ‘ట్యూబ్ లైట్’ మూవీ విడుదలైంది.
ఇలా చాలామంది నటులు మరణించాక వారి చివరి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ స్టార్ యాక్టర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.