సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలోనే ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహిరి కన్నుమూసిన విషాదం మరువక ముందే మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హీరో అర్జున్ సర్జా మావయ్య, ప్రముఖ నటుడు కళాతపస్వి రాజేశ్(89) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోస సంబంధిత ఇబ్బందితో బాధ పడుతున్నా. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు.
ఏప్రిల్ 15, 1932లో జన్మించిన రాజేష్ అసలు పేరు ముని చౌడప్ప. స్టేజ్ షోల్లో నటించే సమయంలో అతడి పేరుని విద్యాసాగర్ గా మార్చుకున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన స్క్రీన్ నేమ్ ను రాజేష్ గా పెట్టుకున్నారు. 1960లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించి ‘కళాతపస్వి’ అనే బిరుదుని సంపాదించుకున్నారు.
150కి సినిమాలలో నటించారు. ఆయన మొదటి సినిమా వీర సంకల్ప 1964లో విడుదలైంది. రాజేష్ కు ఐదుగురు పిల్లలు.. వారిలో ఒకరైన ఆశారాణిని యాక్షన్ కింగ్ అర్జున్ 1988లో వివాహం చేసుకున్నారు. కళాతపస్వి రాజేష్ అంత్యక్రియలు బెంగళూరులోని విద్యారణ్యపుర నివాసంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాజేష్ మృతిపట్ల కన్నడ సినీరంగం సంతాపం వ్యక్తం చేసింది. పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.