ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏడాది సీనీ దిగ్గజ నటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయిన విషాదం నుంచి కోలుకోకముందే సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. తర్వాత ప్రముఖ దర్శకుడు మదన్ హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. ఇక బాలీవుడ్ లో సైతం వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ కన్నుమూశారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
హాలీవుడ్ సీనియర్ నటుడు క్లారెన్స్ గిల్ యార్డ్ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఇండస్ట్రీలోకి రాక ముందు క్లారెన్స్ గిల్ యార్డ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. తర్వాత సినిమాలపై మక్కువతో నటనా రంగంలోకి అడుగు పెట్టాడు. అలా నాటకరంగంలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించిన ఆయన డై హార్డ్, టాప్ గన్ లాంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వార్తలతు ఇండస్ట్రీ టాక్. అయితే ఆయన మృతికి కారణాలు మాత్రం వెల్లడించలేదు.
2006 లో క్లారెన్స్ గిల్ యార్డ్ యూఎన్ఎల్ వీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిల్మ్ ప్రొఫేసర్ పనిచేశారు. కొంత కాలం వరకు ఫిలిమ్, థియేటర్, టెలివిజన్ రంగంలో కొనసాగారు. అయితే యూఎన్ఎల్ వీ ప్రొఫెసర్ గా పనిచేయడానికి కొంత కాలం ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మృతిపై హాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రెటీలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Clarence Gilyard Jr., an actor best known for starring in “Walker, Texas Ranger” and his supporting performance in “Die Hard,” has died aged 66 years old. https://t.co/TR53u7AYWC
— NBC News (@NBCNews) November 29, 2022