మెగాస్టార్ చిరంజీవి – మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజికల్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆల్బమ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇన్నేళ్లయినా వీరి ఆల్బమ్స్ అదే రేంజిలో మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. దాదాపు 12ఏళ్ల తర్వాత చిరు – మణిశర్మ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏడాది కాలంగా వాయిదా పడుతున్న ఆచార్య సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదీగాక రాంచరణ్ కూడా ఈ సినిమాలో నటించడంతో అంచనాలు రెట్టింపు అయిపోయాయి.
తాజాగా ఆచార్య నుండి స్పెషల్ సాంగ్ వచ్చింది. ‘సానా కష్టం’ అంటూ సాగే ఈ మెలోడియస్ మాస్ బీట్ వింటుంటే మెగా ఫ్యాన్స్ కి మణిశర్మ మార్క్ ట్రీట్ ఉంటుందని అర్ధమవుతుంది. అదీగాక మెగాస్టార్ సరసన మందాకినీగా రెజీనా కాలు కదిపింది. స్పెషల్ సాంగ్ కాబట్టి.. రెజినా కూడా గ్లామర్ బాగానే ఒలికించింది. మణిశర్మ మాస్ బీట్ కి.. భాస్కరభట్ల సాహిత్యం, రేవంత్ – గీతామాధురిల గాత్రం.. సానా కష్టానికి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఇక ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో చిరు స్టెప్స్, రెజినా అందాల విందు తట్టుకోవడం కూడా సానా కష్టం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ మెలోడియస్ మాస్ బీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.