సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. కెప్టెన్ గా ధోని ఎంత సక్సెస్ అయ్యాడో అందరకి తెలుసు. దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా, ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోని దొరమయ్యాక కూడా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోని అంటే ఎంత అభిమానమో మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ 2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని..ధోని కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్దమన్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఆశించిన ప్రదర్శన చేయలేదన్నది వాస్తవం. ఒక మ్యాచ్ ఓడితే టోర్నీ నుంచి అవుట్ అన్న తరుణంలో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. ధోని తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. అలా సన్‌రైజర్స్ తో జరిగిన మ్యాచులో కెప్టెన్సీ చేపట్టిన ధోని విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచులో ధోనీ అభిమాని ఒకరు ప్రదర్శించిన బ్యానర్ వీడియో వైరల్ అవుతోంది. “ధోనీ ఒకవేళ నువ్ స్వర్గానికి వెళ్లి ఆడితే.. నేను చావడానికైనా సిద్ధమే” అంటూ ఆ బ్యానర్‌లో ప్రదర్శించాడు. ధోనిపై అభిమానులు పిచ్చోళ్లైపోవడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు అనేకం. ఒక్కోసారి అభిమానులు మైదానంలోకి కూడా దూసుకొస్తుంటారు.
All the best Maahi ❤️❤️🥺
Match day #CSKvSRH #MSDhoni𓃵 pic.twitter.com/bLZKanbvLE— 🙂 (@evesiaa) May 1, 2022
ఇది కూడా చదవండి: Chennai Super Kings: ప్లే ఆఫ్స్ కి చెన్నై! సూపర్ స్కెచ్ రెడీ చేసిన ధోని!
కెప్టెన్ గా, ఆటగాడిగా.. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో ధోని.. అభిమానులను ఎంత ఎంటర్టైన్ చేస్తాడన్నదే కీలకం. ఇక.. ఈ సీజన్ విషయానికొస్తే.. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచులు ఆడిన చెన్నై 3 విజయాలు, 6 పరాజయాల(6 పాయింట్ల)తో 9వ స్థానంలో ఉంది. లీగ్ దశలో చెన్నై ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Sehwag on @MSDhoni 🔥 pic.twitter.com/n7033ZMsZm
— Dhoni Army TN™🦁 (@DhoniArmyTN) May 3, 2022
Just look at those captions Nicholas Pooran gave whenever he posted about @msdhoni 😎 pic.twitter.com/chqisEAIjf
— Dhoni Devotee ❤ (@CricHarsha) May 3, 2022