వివాహేతర సంబంధం.. ఇదే నిండు జీవితాలను రోడ్డున పడేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలు భర్తను కాదని పక్కంటి మగాడితో పరిచయం చేసుకుని తెరవెనుక కాపురానికి జెండా ఊపుతున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. భర్త గమనించి మందలించే ప్రయత్నం చేసినా తిరిగి కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు కొందరు కసాయి మహిళలు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామం. రామయ్య జయలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. పెళ్లై ఓ కూతురు, కుమారుడు కూడా జన్మించారు. పిల్లా పాపలతో వారి జీవితం సుఖంగా సాగుతోంది. కొన్నాళ్ల పాటు సంతోషంగా గడిపిన వీరి కుటుంబంలో జరగరాని ఘోరం జరిగింది. అయితే రామయ్య భార్య జయలక్ష్మి రెండేళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన మహ్మద్ కైజర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు తెలియకుండా బయటి సుఖానికి అలవాటు పడింది. అలా సమయం దొరికినప్పుడల్లా కైజర్ తో ఆ మహిళ శారీరక కలుసుకుంటుంది.
కొన్నాళ్లకు ఈ విషయం కాస్త భర్త రామయ్యకు తెలిసింది. భార్యను మందలించే ప్రయత్నం చేశాడు. దీంతో బుద్దిమార్చుకోని జయలక్ష్మి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని భావించింది. అయితే ఈ నెల 13వ తేదీన రాత్రి భర్త గొంతుకి టవల్ బిగించి హత్య చేసింది. ఈ ఘోరాన్ని కూతురు, కుమారుడు కళ్లారా చూసి లబోదిబోమన్నారు. ఇక హత్య అనంతరం ప్రియుడి సాయంతో భర్త శవాన్ని హంద్రీ – నీవా కాలువలో పడేసింది. ఇంతటితో ఆగకుండా భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిపై అనుమానంతో పిల్లలను విచారించారు. ఇక కుమారుడు, కూతురు పూసగుచ్చినట్లు తల్లి చేసిన ఘోరాన్నంత పోలీసులకు వివరించారు. ఎట్టకేలకు నేనే చంపానంటూ భార్య ఒప్పుకుంది. దీంతో జయమ్మపై ఆమె ప్రియుడి కైజర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.