Crime News : తాగుడుకు బానిసైన ఓ తమ్ముడు విచక్షణను కోల్పోయాడు. మంచి చెప్పాలని, తమ్ముడ్ని మంచి దారిలో పెట్టాలని చూసిన అక్కను తుపాకితో కాల్చి చంపేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిస్‌రఖ్ పోలీస్ స్టేషన్ పరిథిలోని రోజా జలాల్‌పుర్ గ్రామానికి చెందిన సురాజ్ అనే యువకుడు తాగుడికి బానిస. ప్రతిరోజు తప్పతాగి ఇంటికి వస్తుండేవాడు. శుక్రవారం కూడా బాగా తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిరాగానే వాంతికి చోసుకున్నాడు. ఇది చూసి అతడి అక్క రుచి తట్టుకోలేకపోయింది. రోజూ తాగి తమ్ముడు చెడిపోతున్నాడని బాధపడింది. అతడికి నాలుగు మంచి మాటాలు చెప్పి మార్చాలని చూసింది.
మంచి చెయ్యాలనే ఉద్ధేశ్యంతోనే అతడి తిట్టింది. అయితే, రుచి అలా తిట్టడం అతడికి నచ్చలేదు. ఆమెతో వాదనకు దిగాడు. వాదన పెద్దదయింది. కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ టైంలో సురాజ్ అక్కడినుంచి ఇంట్లోకి వెళ్లిపోయాడు. నాటు తుపాకి పట్టుకుని రుచి దగ్గరకు వచ్చాడు. దాంతో ఆమెను కాల్చాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తుపాకి గుండు చేసిన తీవ్ర గాయం కారణంగా రుచి అక్కడికక్కడే మృత్యువాతపడింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం రోజున పరారీలో ఉన్న నిందితుడ్ని గ్రేటర్ నోయిడాలోని షహ్‌బేరీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : దొంగతనాలకోసం రిక్రూట్ మెంట్! నెలకు వేలల్లో జీతం..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.