కర్ణాటక రాష్ట్రం తుమ్ముకూరు సమీపంలోని జాతీయ రహదారిపై కుప్పలు కుప్పలుగా పడిఉన్న వాడేసిన కండోమ్స్‌ల వార్త అలాఅలా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టూపక్కల ఏదైనా రెడ్‌లైట్ ఏరియా ఉందేమోనని అనుమానంతో విచారించారు. అలాంటిదేం లేకపోవడంతో లాడ్జ్‌లలో రైడ్ నిర్వహించారు. ఈ క్రమంలో నంది డీలక్స్ లో సిబ్బంది తడబాటును పసిగట్టిన పోలీసులు వారి స్టైలో విచారించగా నివ్వెరపోయే విషయం బయటపడింది. లాడ్జ్ సొరంగం ఏర్పాటు చేశారు.
చాలా కాలంగా అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విధంగా వ్యభిచారం చేయడంతో కండోమ్స్ లాడ్జ్‌లో పేరుకుపోయాయి. వాటిని లాడ్జ్ సిబ్బంది జాతీయ రహదారి పక్కన పడేయడంతో ఈ భారీ వ్యభిచార కూపం బయటపడింది. రూమ్‌లోని ఓ టేబుల్ కింద నుంచి ఉన్న సొరంగం చూసి పోలీసులే షాక్ తిన్నారు. వ్యభిచారం చేసేందుకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని ఆశ్యర్యపోతున్నారు. లాడ్జ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారింస్తున్నారు.