Transgender: లోకల్ ట్రైన్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ హల్‌చల్ చేసింది. బొమ్మ గన్‌తో పువ్వులమ్ముకునే మహిళను బెదిరించి, డబ్బు దోచుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం పువ్వులమ్ముకునే ఓ మహిళ ముంబైలోని దర్బార్ నుంచి వాసై వెళ్లటానికి లోకల్ ట్రైన్ ఎక్కింది. ఆ సమయంలో కంపార్ట్‌మెంట్‌లో ఆమెతో కలిపి మొత్తం నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారు. ట్రైన్ అంథేరిలో ఆగగానే ప్రఫుల్ బాలక్రిష్ణ పాంచాల్ అనే ట్రాన్స్‌జెండర్ ట్రైన్‌లోకి ఎక్కింది. మద్యం మత్తులో ఉన్న పాంచాల్ పువ్వులమ్ముకునే మహిళ దగ్గరకు వచ్చింది. ఆమెను డబ్బులు కావాలని డిమాండ్ చేసింది. సదరు మహిళ డబ్బులు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన ట్రాన్స్‌జెండర్ తన జేబిలోని బొమ్మ తుపాకిని బయటకు తీసింది.
దాంతో కాలుస్తానని మహిళను బెదిరించింది. అది బొమ్మ తుపాకి అని తెలియని మహిళ భయపడిపోయింది. తన పర్సులోని నాలుగు వేల రూపాయల్ని పాంచాల్‌కు ఇచ్చింది. ట్రైన్ బోరివ్లికి చేరుకోగానే పాంచాల్ రైలు పట్టాలపైకి దూకింది. ఆ వెంటనే పక్కనే ఉన్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కి వెళ్లిపోయింది. బాధిత మహిళ రైల్వే పోలీసులను ఆశ్రయించింది. పాంచాల్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాంచాల్ కోసం అన్వేషణ ప్రారంభించారు. శుక్రవారం విలే పార్లే స్టేషన్‌లో పాంచాల్‌ను అరెస్ట్ చేశారు. బొమ్మ గన్‌తో పాంచాల్ జనాలను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. పాంచాల్ ఓ హిస్టరీ షీటరని, ఇదివరకే చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గోల్డ్ లోన్ స్కాం.. శ్రీశైలం కెనరా బ్యాంకులో భారీ మోసం..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.