మూడు ముళ్ల బంధంతో అన్యోనంగా గడపాల్సిన భర్యభర్తలు పెళ్లైన కొద్ది రోజులకే బంధాలను తెంచుకుంటున్నారు. పెళ్లికి ముందు వరకట్నం కింద లక్షలకు లక్షలు తీసుకుని ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యలను వేదిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బరేని జిల్లాలోని కంటోన్మేంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో షహనాబి అనే మహిళకు గతంలో వివాహం జరిపించారు.
అయితే కట్నం కింద అమ్మాయి పేరు మీద మూడు ఎకరాల భూమిని సైతం రాసి ఇచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇక కొంత కాలం ఈ నవ దంపతులు బాగానే ఉన్నారు. ఇక రోజులు గడిచేకొద్ది భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య నల్లగా ఉందన్న నెపంతో అదనపు కట్నం కింద రోజు వేదిస్తూ ఉండేవాడు. దీనికి ఆలం తల్లిదండ్రుల మద్దతు కూడా తోడవడంతో అరాచకాలు హద్దులు దాటాయి. మిగిలిన భూమి అమ్మి రూ.10 లక్షలు ఓ కారు కావాలంటూ బలవంతం చేసేవారట. ఇక ఎంతకు కూడా ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో తలాక్ చెప్పారంటూ మహిళ తరుపు బంధువులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇక త్రిబుల్ తలాక్, గృహ హింస, అదనపు కట్నం కింద భర్త ఆలంపై పోలీసులు కేసు నమోదు చేశారు.