ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురి అవుతున్నారు. కుటుంబ కలహాలు, అప్పుల బాధలు, మానసిక వత్తిడి కారణాలు ఏవైనా మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. హోలీ పండగ వేళ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం. కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది చదవండి: కొత్త సిమ్ కార్డు కొనివ్వలేదని బాలుడు ఏం చేశాడంటే..
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు చెరువులో నుంచి ఇద్దరు చిన్నారులు.. అన్షిక (5), అభిగ్న (3) మృతదేహాలను వెలికితీశారు. తల్లి రేఖ కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని బంధువులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.