తెలంగాణ రాష్ట్రంలో ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలోలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలు మాత్రమే కాదు.., కొన్ని పట్టణాలు కూడా జలమయమయ్యాయి.ఇక రానున్న మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు తప్పవని ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు చేసింది. అయితే.., ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట ఆర్టీసీ బస్సు మానేరు వాగులో కొట్టుకుపోయింది.
ఈ బస్సు కామారెడ్డి నుంచి సిద్దిపేటకు బయలు దేరింది. అయితే.., మార్గ మధ్యలో భారీ వర్షం పడటంతో మానేరు వాగుకి వరద తాకిడి ఎక్కువ అయ్యింది. ఈ క్రమంలోనే బస్సు వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో అప్పటికే 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు. కానీ.., ఎంత ప్రయత్నించినా బస్సుని మాత్రం కొట్టుకుపోకుండా ఆపలేకపోయారు. డ్రైవర్ వరద స్థాయిని తక్కువగా అంచనా వేసి.., బస్సును ముందుకు పోనివ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.., ఇంత పెద్ద ఘటనలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.