కర్ణాటకలో పేలుడు కలకలం సృష్టించింది. ఈ పేలుడి దాటికి అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..బెంగుళూరులోని చామరాజపేటలోని ఓ భవననంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడి దాటికి ముగ్గురు శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇక ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పేలుడిలో గాయపడిన వారిని రక్షిస్తున్నారు. భవనంలో ఎంత మంది ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని స్థానికులు తెలియజేస్తున్నారు.