ఆనందంతో విజిల్ వేస్తూ సినిమా చూడాల్సిన థియేటర్ లో కాల్పుల కలకలం రేగింది. వినటానికి భయంకరంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలో తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. హవేరి జిల్లా షిగ్గాన్ లో యష్ హీరోగా తెరకెక్కిన KGF-2 సినిమా ప్రదర్శితమవుతోంది. మూవీ చూసేందుకు అభిమనులు పోటీపడి థియేటర్ కు వెళ్తున్నారు. మూవీ సూపర్ హిట్ కొట్టడంతో కొందరు రెండుమూడు సార్లు సైతం చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: కానిస్టేబుల్ వేధింపులకు యువతి ఆత్మహత్య!
అయితే అలా వెళ్లిన ఓ అభిమాని సినిమా చూస్తూ కాలు ముందు సీటుపై పెట్టాడు. దీంతో ముందున్న వ్యక్తి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుకు కూర్చున్న వ్యక్తి వెంటనే బయటకు వెళ్లి గన్ తో తిరిగొచ్చాడు. దీంతో మరోసారి గొడవకు దిగడంతో గన్ తో కాలు సీటుపై కాలు పెట్టిన వ్యక్తిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో థియేటర్ లో జనాలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని థియేటర్ యజమానులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.