ఉమేష్ రెడ్డి.. ఈ పేరు వినబడితే కర్ణాటక వాసులు ఇప్పటికి కూడా గజ గజ ఒణికిపోతారు. ఆ నీచుడు మాకు దొరికితే.. వాడికి నరకంలో కూడా లేనటువంటి భయానక శిక్షలు మేం విధిస్తామని కసిగా అరుస్తారు. అసలు ఆ నీచుడిని తిట్టడానికి.. శిక్షించడానికి భూమ్మీద సరైన పదాలు, శిక్షలు లేవని భావిస్తారు. ఏళ్ల పాటు ఆ రాక్షసుడు తన వికృత క్రీడను కొనసాగించాడు. 20 మంది మహిళలపై అత్యాచారం చేశాడు.. 17 మందిని అతి దారుణంగా హత్య చేశాడు. అతడు చేసిన నేరాలకు గాను బెంగళూరు కోర్టు.. ఉరిశిక్ష విధించింది. దాంతో అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం.. బెంగళూరు హైకోర్టు.. ఉమేష్ రెడ్డికి విధించిన ఉరి శిక్షను రద్దు చేస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. ఇక సుప్రీం కోర్టు తీర్పుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగదని వాపోతున్నారు. కర్ణాటకలో పెను సంచలనం సృష్టించిన ఉమేష్ రెడ్డి నేర చరిత్ర మీద కన్నడలో రెండు సినిమాలు కూడా వచ్చాయి. ఈ సైకో సీరియల్ కిల్లర్ చేసిన దారుణాల గురించి పూర్తి వివరాలు..
కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించిన ఉమేష్ బీఏ పూర్తి చేసిన తర్వాత సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగానికి సెలక్టయ్యాడు. తొలి పోస్టింగ్ జమ్ము కశ్మీర్‌లో ఇచ్చారు. ఓ కమాండెంట్ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తోన్న ఉమేష్.. సదరు కమాండెంట్ కుమార్తె మీద అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి అతడి నేర చరిత్ర ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత అక్కడి నుంచి చిత్రదుర్గకు పారిపోయి వచ్చాడు. కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న ఉమేష్.. ఆ తర్వాత 1996 డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్‌లో జాయిన్ అయ్యాడు. అతడి పాత నేర చరిత్ర బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. మధ్యప్రదేశ్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని.. కర్ణాటకకు వచ్చాడు. ఈ ట్రైనింగ్ సందర్భంగా ఓ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నాడు. కాన్నీ ఉన్నతాధికారులు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. నాడు వారు చేసిన తప్పుకు.. తర్వాత ఎందరో బలయ్యారు.
ఇక ఉమేష్ రెడ్డి నిందితులను చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటాడు. ముఖ్యంగా హౌస్‌వైఫ్స్‌ని టార్గెట్ చేస్తాడు. ఉదయం 11-3 గంటల ప్రాంతంలో.. అంటే మగాళ్లు ఇల్లలో లేని సమయంలో నేరాలు సాగిస్తాడు. ముందుగా ఓ ఇంటికి వెళ్లి.. మంచి నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. ఆ తర్వాత బాధితుల వెనకే ఇంట్లోకి వెళ్లి కత్తితో వారిని బెదిరిస్తాడు. ఆ తర్వాత వారిని కట్టేసి.. నగ్నంగా మార్చి అత్యాచారానికి పాల్పడతాడు. ఒక్కోసారి బాధితులను చంపి.. వారి మృతదేహాల మీద అత్యాచారం చేసేవాడు. ఆ తర్వాత వారి ఒంటి మీద ఆభరణాలు తీసుకుని వెళ్లేవాడు. చూసేవారికి అది దొంగతనంలా అనిపించేది. ఇక సంఘటన స్థలం నుంచి పోతూ పోతూ.. బాధితులు లో దుస్తులు తీసుకుని వెళ్లేవాడు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో అతడు మహిళల లోదుస్తులు ధరించి ఉండటమే కాక.. ఓ సంచి నిండా ఆడవారి లోదుస్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఉమేష్ రెడ్డి.. 1996లో స్కూల్ విద్యార్థిని మీద అత్యాచారానికి యత్నించాడు. కానీ బాలిక అతడిని రాళ్లతో కొట్టి అక్కడ నుంచి పారిపోయింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలో మరో మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు. అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయిన ఉమేష్ రెడ్డిని.. అతడి బారి నుంచి తప్పించుకున్న విద్యార్థిని గుర్తు పట్టి పోలీసులకు తెలపడంతో.. అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో మైనర్ బాలికపై హత్యాచారం చేసినందుకు ఉమేష్ రెడ్డిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మహిళల లోదుస్తులు దొంగిలిస్తూ పోలీసులకు చిక్కాడు. అప్పుడు తన పేరు రమేష్ అని చెప్పాడు. ఆ తర్వాత 24 గంటల్లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
ఇలా సాగిపోతున్న ఉమేష్ రెడ్డి నేర చరిత్రకు బెంగళూరులో జరిగిన ఓ హత్యతో ఎండ్ కార్డ్ పడింది. 1998 ఫిబ్రవరి 28వ తేదీన బెంగళూరు నగరంలోని పిణ్యా పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త చనిపోయిన మహిళకు దెయ్యం పట్టిందని ఆమె కొడుకుకు చెప్పాడు ఉమేష్ రెడ్డి. తాను దెయ్యాన్ని పారదోలే బూత వైద్యుడనని నమ్మించి.. ఆమెను నగ్నంగా మార్చి.. గ్రిల్స్‌కు కట్టేసి.. ఆమెపై అత్యాచారం చేశాడు ఉమేస్ రెడ్డి. సదరు మహిళ ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీని గురించిబాధితురాలి కొడుకు కేసు పెట్టాడు. ఈ అత్యాచారం, హత్య కేసులో ఉమేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
ఇక పోలీసులు విచారణలో ఉమేష్ రెడ్డి.. విస్తుపోయే వాస్తవాలు వెల్లడించాడు. పోలీసు ఉద్యోగం అడ్డుపెట్టుకుని.. మహిళల మీద తాను సాగించిన హత్యాచారాల గురించి వెల్లడించిన వివరాలు చూసి పోలీసులే భయపడ్డారు. పోలీసు కానిస్టేబుల్‌గా భావిస్తోన్న వ్యక్తి సైకో సీరియల్ కిల్లర్ అని తేలడంతో.. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇక విచారణలో ఉమేష్.. మొత్తం 17 మందిని హత్య చేశాడని.. 20 మందిపై అత్యాచారం చేశాడని పోలీసులు కేను నమోదు చేశారు. కానీ చాలా వరకు కేసుల్లో సరైన ఆధారాలు లేకపోవడంతో.. అతడికి ఊరట లభించింది.
అయితే బెంగళూరులోని పిణ్యాలో జరిగిన విధం మహిళ మీద అత్యాచారం, హత్య చేసిన కేసులో ఉమేష్ రెడ్డికి విరుద్దంగా బలమైన సాక్షాధారాలు లభించాయి. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు ఉమేష్ రెడ్డికి 2006లో ఉరిశిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉమేష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే రెండు సార్లు.. అతడికి ఎదురుదెబ్బే తగిలింది. అంతేకాక. గవర్నర్, రాష్ట్రపతి కూడా ఉమేష్ రెడ్డి క్షమాభిక్షను తిరస్కరించారు. అయితే క్షమాభిక్షపత్రం పరిశీలించడంలో ఆలస్యం చేశారని ఉమేష్ రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు.. సంచలన తీర్పు వెల్లడించింది. ఉమేష్ రెడ్డికి విధించిన ఉరిశిక్షను రద్దు చేస్తూ.. యావజ్జీవ శిక్ష విధించింది. అతడు చచ్చే వరకు జైల్లో ఏకాకిలా మగ్గిపోవాలని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Supreme Court Commutes Death Sentence of rapist #UmeshReddy pic.twitter.com/CASfIbzcz0
— Headline Karnataka (@hknewsonline) November 4, 2022