ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు చాలానే ఎక్కువవుతున్నాయి. దీంతో పాటు కొందరు కేటుగాళ్లు అందంగా కనిపించిన అమ్మాయిలను, వివాహితులను వేదించటం ఆ తర్వాత ఓప్పుకోకపోతే ఆత్యాచారినికి దిగి ఆపై హత్య చేయటం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కథ అందుకు భిన్నంగా ఉంది. ఇక విషయం ఏంటంటే..? బీహార్ లోని సఫౌల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఖలీల్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో సహా నివాసం ఉంటున్నాడు.
అయితే ఈ క్రమంలోనే ఇంటిపక్కనే ఉన్న రంజితా శర్మా అనే వివాహితపై కన్నేశాడీ కామంధుడు. ఆ మహిళ భర్త,ఇద్దరు పిల్లలతో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తోంది. ఈ తరుణంలోనే ఆ వివాహితపై స్థానికంగా ఉండే ఖలీల్ రోజు చూస్తూ కామంతో రగిలిపోయేవాడు. దీంతో ఓ రోజు నీ అందానికి పడిపోయానని, నువ్వొస్తే కలిసి కాపురం చేద్దామని తెలిపాడు. దీనికి ఆ మహిళ అంగీకరించలేదు. పలుమార్లు ఇదే పనిగా ఆ వివాహితను రావాలంటూ వేదించేవాడు. వినకపోవటంతో ఆ మహిళ ఆగ్రహానికి గురై హెచ్చరించే ప్రయత్నం చేసింది.
దీంతో ఖలీల్ లో మార్పు ఏ మాత్రం కనిపించలేదు. దీంతో ఎలాగైన కిడ్నాప్ చేయాలని భావించి ఓ రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఖలీల్ అనుకున్న రోజు రానే వచ్చింది. తన స్నేహితుల సాయంతో ఆ వివాహితను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధిచాడు. దీంతో ప్రతీ రోజు ఆ మహిళపై కామకోరికలు తీర్చుకుంటూ కోరకున్న సుఖాన్నిఅనుభవించాడు. అలా రెండు నెలల పాటు ఒకే గదిలో ఉంటూ వివాహతను నానా హింసకు గురి చేసేవాడు. ఇక ఏం చేయాలో తెలియక ఆ మహిళ పక్కింటి వాళ్ల సాయంతో తనభర్తకు తనను బంధీ చేసిన ఏరియాను తెలిపింది.
వెంటనే ఇదే విషయాన్ని తన భర్త పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. ఖలీల్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని, నిందితుడిని 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని, బాధితురాలి వైద్యపరీక్షల నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసు అధికారి సుభేద్ కుమార్ చెప్పారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.