Karnataka: పెద్దలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారన్న బాధతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. యువతీ,యువకులిద్దరూ పురుగుల మందు తాగి మరణించారు. యువతికి పెళ్లైన నెల రోజుల్లోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఉత్తర కన్నడలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని హళియాళకు చెందిన రికేష్ సురేష్ మిరాశి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అంత్రోళకర ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. స్నేహంతో మొదలైన వీరి బంధం ప్రేమగా మారింది.
గత కొన్ని నెలల నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు జ్యోతికి నెల రోజుల కిందట వేరే యువకుడితో వివాహం చేశారు. గుండెలో ఎంతో బాధను నింపుకుని జ్యోతి అత్తింట్లోకి అడుగుపెట్టింది. రోజులు వేగంగా గడిచాయి. అయినా.. సురేష్‌ను మర్చిపోలేకపోయింది. అక్కడ సురేష్ పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఇద్దరూ చనిపోవాలని నిశ్చయించుకున్నారు.
ఈ నెల 15న ముండగోడు రోడ్డులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం మంగళవారం ఇద్దరూ మరణించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆ ఫోటోలు షేర్ చేసినందుకు.. ప్రముఖ దర్శకుడి అరెస్ట్..!