crime news : ‘కామాం తురాణం నభయం నలజ్జ’ అన్నట్లు కొందరు కామాంధులకు కామంతో ఉన్నపుడు ఏం చేస్తున్నాం.. ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది తెలీదు. పశుపక్ష్యాదులు సైతం వారి కామ కోరికలు తీర్చే వాటిగా మారిపోతాయి. తాజాగా ఓ సైకో కామంధుడు ఏకంగా లేగ దూడపై అత్యచారం చేశాడు. ఓ ఇంటి దగ్గరకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కారేపల్లికి చెందిన ఉపేందర్ శుక్రవారం రాత్రి అర్థనగ్నంగా ఆదెర్ల శ్రీను ఇంటికి వచ్చాడు. అక్కడ కట్టేసిన లేగదూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను ఇంటి వాళ్లు సెల్‌ఫోన్‌లో బంధించారు. అనంతరం అతడ్ని పట్టుకోవటానికి ప్రయత్నించగా పారిపోయాడు.
కారేపల్లి సమీపంలోని చెరువు దగ్గర అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఉపేందర్ వికృత చేష్టలు తట్టుకోవటం వల్లకావటం లేదని గ్రామంలోనుంచి పంపేయాలని కాలనీ వాసులు పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గతేడాది ఉపేందర్ ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసి ఆమెను చంపేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేశాడు. ఈ కేసులో నిందితుడిగా జైలుకు కూడా పోయివచ్చాడు. అయినప్పటికి అతడిలో మార్పు రాలేదు. మళ్లీ తన సైకో పనులు మొదలుపెట్టాడు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మహిళతో బాబాయ్ సంబంధం.. చూసిన అన్న కొడుకును దారుణంగా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.