ఖమ్మం జిల్లా కారేపల్లి పేలుడు ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. ఈ పేలుడికి, ఆత్మీయ సమ్మేళనానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు, బాణాసంచా పేల్చగా బాణసంచా నిప్పు రవ్వ ఎగిరి గుడిసెపై పడడంతో భారీ పేలుడు సంభవించింది. గుడిసెలో ఉన్న సిలిండర్ పేలడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ గతంలో ఇద్దరు మృతి చెందారు. కాళ్ళూ, చేతులూ తెగి ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. ఈ ఘటన పట్ల బాధితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
కాగా ఈ ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. ఎండ వల్ల గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. గుడిసెకు, ఆత్మీయ సమ్మేళన వేదికకు 200 మీటర్ల దూరం ఉందని అన్నారు. ఒక చిన్న గుడిసెలో ఉన్న సిలిండర్ పేలడం నిజంగా బాధాకరమని అన్నారు. గాయపడ్డవారికి అన్ని రకాలుగా వైద్య సదుపాయాలు అందజేస్తామని అన్నారు. బాధితులను ఆదుకుంటామని నామా హామీ ఇచ్చారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం వల్లే ప్రమాదం జరిగిందని నామా అన్నారు. ఘటనకు, ఆత్మీయ సమ్మేళనానికి ఎలాంటి సంబంధం లేదని నామా నాగేశ్వరరావు అన్నారు. సిలిండర్ పేలడానికి, ఆత్మీయ సమ్మేళనానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. మరి నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.