Crime News: తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సిన ఓ అన్న నీచానికి పాల్పడ్డాడు. తోడ బుట్టిన చెల్లెళ్లపై అత్యాచారం చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ సంఘటన జార్ఖండ్‌లో బుధవాం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, లోహర్‌దగా జిల్లా న్యూ ఆజాద్ బస్తీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి అదే ఏరియాలో నివాసం ఉంటున్నాడు. కామంతో కళ్లుమూసుకుపోయిన మెకానిక్ సొంత చెల్లెలిపై కన్నేశాడు. 19 ఏళ్ల పెద్ద చెల్లెలిపై గత 4 సంవత్సరాల నుంచి అత్యాచారం చేస్తూవస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం పెద్ద చెల్లెలు స్నానం చేసి, వంట గదిలోకి వెళ్లింది. ఆమె వెనకాలే వంట గదిలోకి వెళ్లి అత్యాచారం చేయసాగాడు. అరుస్తూ, ఏడుస్తున్నా వదల్లేదు. ఆ అరుపులు విన్న చిన్న చెల్లెలు అక్కడికి వెళ్లింది. అన్ననుంచి అక్కను రక్షించటానికి ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో కత్తితో భయపెట్టి ఆమెపై కూడా అత్యాచారం చేయసాగాడు. ఇద్దరు అమ్మాయిలు ఏడవసాగారు. వారి అరుపులు విన్న కన్నతల్లి అక్కడికి వెళ్లింది. ఒంటిపై బట్టలు లేకుండా, చెల్లెళ్లతో చేయకూడని పని చేస్తున్న కొడుకును చూసి ఆమె షాక్ తింది. తేరుకుని కొడుకును ఆపబోయింది. అయితే, సదరు కామాంధుడు తల్లిపై కూడా అత్యాచారం చేయటానికి ప్రయత్నించాడు. కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడినుంచి బయటకు వెళ్లిపోయాడు. కొడుకు చేసిన నీచమైన పనిని జీర్ణించుకోలేకపోయిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : డిగ్రీ చదివే యువతికి లిఫ్ట్ ఇచ్చాడు.. ఫీలింగ్స్ కలుగుతున్నాయని చెప్పి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.