అతనొక సమాజానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల కానిస్టేబుల్ వృత్తిలో కొనసాగుతున్నాడు. తన వృత్తి విలువలకు నీళ్లొదిలి ఓ మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ప్రాంతంలో శివరాజ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అయితే స్థానికంగా ఉండే ఓ గ్రామంలో కేసు విచారణ నిమిత్తం ఓ మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు కానిస్టేబుల్ శివరాజ్. దీంతో ఆ బాలికను చూసిన శివరాజ్ ఎలాగైన లొంగదీసుకోవాలనే అనే విషపు ఆలోచనల్లో మునిగి తేలిపోయాడు. ఇక మనోడు అదే పనిగా తరుచూ ఆ బాలిక ఇంటి చుట్టు తిరిగి మాయమాటలు చెప్పి ఆ బాలికతో కాస్త మాటగలిపాడు. దీంతో కానిస్టేబుల్ అని నమ్మిన ఆ మైనర్ బాలిక అతనితో మెల్లగా ఫోన్ లో మాట్లాడుకోవటం, బయట కలిసి తిరగటం ఇద్దరూ చేశారు.
అలా కొన్నాళ్లకి ఇద్దరు శారీరకంగా కూడా కలుసుకున్నారు. రోజులు గడిచిన కొంతకాలానికి ఆ బాలిక గర్భవతి అని తేలింది. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలం నుంచి ఆ బాలిక ఆరోగ్యంలో మార్పు రావటంతో తల్లిదండ్రులు నిలదీసి అడిగే ప్రయత్నం చేశారు. ఇక ఆ బాలిక తన తల్లిదండ్రులతో అసలు విషయాన్ని పూస గుచ్చినట్లు వివరించింది. ఇదే విషయం శివరాజ్ కి తెలియటంతో విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు పాటించాడు.
అబార్షన్ చేయించుకోవాలని బాలిక తల్లిదండ్రుల సమక్షంలో రూ. 35,000 ముట్టజెప్పాడు. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో శివరాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని కోర్టుకు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.